మిచౌంగ్ తుఫాన్(Cyclone Michaung) తమిళనాడు(Tamil Nadu)ను అల్లకల్లోలం చేసింది. చెన్నై(Chennai) మహానగరం అయితే భారీ వర్షాల ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. రెస్క్యూ టీమ్ చాలా మందిని కాపాడింది. ఇప్పుడిప్పుడే నగరం కోలుకుంటోంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. వేలాది మంది రోడ్డున పడ్డారు.
మిచౌంగ్ తుఫాన్(Cyclone Michaung) తమిళనాడు(Tamil Nadu)ను అల్లకల్లోలం చేసింది. చెన్నై(Chennai) మహానగరం అయితే భారీ వర్షాల ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. రెస్క్యూ టీమ్ చాలా మందిని కాపాడింది. ఇప్పుడిప్పుడే నగరం కోలుకుంటోంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. వేలాది మంది రోడ్డున పడ్డారు. పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నా చాలా చోట్ల ప్రజలు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సేవకులు వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందచేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా తమకు తోచిన సాయాన్ని చేస్తున్నారు. తమ అభిమానులను కూడా సహాయక చర్యలలో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. లేడి సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) కూడా తన వంతు సాయాన్ని అందిస్తున్నారు. తన సంస్థ పెహీ 9 ఆధ్వరయంలో చెన్నై వేలచ్చేరి కైవేలి బ్రిడ్జ్ సమీపంలోని ప్రాంతాలలో వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణి చేసింది. శానిటరీ న్యాప్‌కిన్లు, వాటర్ బాటిళ్లు మరియు ఫుడ్ ప్యాకెట్లు అందించారు. నయనతార చేస్తున్న సేవకు నెటిజన్లు, అభిమానులు సలాం కొడుతున్నారు. కొందరు మాత్రం ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ఫెమీ 9 కంపెనీకి చెందిన అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు ఉన్న ప్రత్యేక వాహనంలో వరద బాధితులకు సహాయం అందించడం నెటిజన్లకు నచ్చలేదు. వీడియో చివర్లో, స్థానిక మహిళలు కొందరు నయనతారకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన కొందరు నయనతారను విమర్శిస్తున్నారు. మహిళలను బలవంతంగా పెట్టి ఈ దృశ్యాలను చిత్రీకరించారని వ్యాఖ్యానిస్తున్నారు.