ముంబాయికి(Mumbai) చెందిన నటి లైలాఖాన్(Laila khan), ఆమె కుటుంబసభ్యుల సామూహిక హత్య కేసులో(Murder case) దోషి అయిన ఆమె సవతి తండ్రి(step Father) పర్వేజ్ తక్‌కు(Parvez Tak) మరణశిక్ష విధించింది అదనపు సెషన్స్ కోర్టు. 2011లో లైలాఖాన్తో పాటు ఆమె కుటుంబసభ్యుల్లోని ఆరుగురు ్యక్తులు ఇంట్లోనే హత్యకు గురికావడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
ముంబాయికి(Mumbai) చెందిన నటి లైలాఖాన్(Laila khan), ఆమె కుటుంబసభ్యుల సామూహిక హత్య కేసులో(Murder case) దోషి అయిన ఆమె సవతి తండ్రి(step Father) పర్వేజ్ తక్‌కు(Parvez Tak) మరణశిక్ష విధించింది అదనపు సెషన్స్ కోర్టు. 2011లో లైలాఖాన్తో పాటు ఆమె కుటుంబసభ్యుల్లోని ఆరుగురు ్యక్తులు ఇంట్లోనే హత్యకు గురికావడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆస్తి కోసమే పర్వేజ్ తక్ ఇంతటి పాతకానికి ఒడిగట్టాడు. లైలాఖాన్ తల్లి సెలీనాకు పర్వేజ్ తక్ మూడో భర్త. సెలీనా ఆస్తులపై కన్నేసిన పర్వేజ్ తరచూ వాటి విషయంపై భార్యతో గొడవపడుతుండేవాడు. 2011లో ముంబాయిలో తమ ఇంట్లోనే ముందు భార్య సెలీనాను చంపేశాడు పర్వేజ్. తర్వాత లైలాఖాన్‌ను హత్య చేశాడు. తర్వాత ఆమె నలుగురు తోబుట్టువుల ప్రాణాలు తీశాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరిని చంపేశాడు పర్వేజ్. తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. జమ్ముకశ్మీర్ పోలీసులు పర్వేజ్‌తక్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నప్పుడు హత్యల విషయం బయటకు వచ్చింది. పర్వేజ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా హత్య జరిగిన బంగ్లానుంచి పూర్తిగా కుళ్లిపోయిన మృతదేహాలను వెలికి తీశారు. సుమారు 13 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరిగింది. ఈ నెల 9వ తేదీన సెషన్స్ జడ్జి పర్వేజ్‌ను దోషిగా తేల్చారు. ఇవాళ జడ్జి సచిన్ పవార్ అతడికి మరణదండన విధించారు.