ఎనిమిదో దశకంలో ఖుష్బూ(Kushboo) టాప్ హీరోయిన్‌గా కొనసాగారు. తమిళ ప్రేక్షకులు అయితే ఆమెను అమితంగా ఆరాధించారు. ఆమెకు ఏకంగా గుడే కట్టేశారు. తెలుగులో కూడా అగ్రతారలతో కలిసి నటించారు ఖుష్బూ. ఉత్తరాదిలో పుట్టి పెరిగిన ఖుష్బూ దక్షిణాదిలో ప్రముఖ నటిగా రాణిస్తుండటం విశేషం. అలాగే రాజకీయాలలో కూడా ఆమె రాణిస్తున్నారు.
ఎనిమిదో దశకంలో ఖుష్బూ(Kushboo) టాప్ హీరోయిన్‌గా కొనసాగారు. తమిళ ప్రేక్షకులు అయితే ఆమెను అమితంగా ఆరాధించారు. ఆమెకు ఏకంగా గుడే కట్టేశారు. తెలుగులో కూడా అగ్రతారలతో కలిసి నటించారు ఖుష్బూ. ఉత్తరాదిలో పుట్టి పెరిగిన ఖుష్బూ దక్షిణాదిలో ప్రముఖ నటిగా రాణిస్తుండటం విశేషం. అలాగే రాజకీయాలలో కూడా ఆమె రాణిస్తున్నారు. ఆల్‌మోస్టాల్ అన్ని పార్టీలలో ఆమె ఉన్నారు. కాంగ్రెస్(Congress) నుంచి బీజేపీలో(BJP) చేరిన ఖుష్బూ ఇప్పుడా పార్టీలో కీలక భూమిని పోషిస్తున్నారు.
ఇలా అన్ని రంగాలలో పేరు సంపాదించుకున్న ఖుష్బూకు ఇటీవల ఒక అరుదైన గౌరవం లభించింది. అదేమిటంటే.. తిరుచూరులో(Tiruchur) ఉన్న విష్ణుమాయ ఆలయానికి(Vishnumaya temple) ఓ ప్రత్యేకత ఉంది. ఈ గుడిలో ఏడాదికి ఒకసారి ప్రత్యేక నారీ పూజ(Nari Pooja) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం ఓ మహిళను ఆహ్వానిస్తారు. ఈసారి ఆ గౌరవం నటి ఖుష్బూకు లభించింది. ఆ ఆలయ నిర్వాహకులు నటి కుష్బూను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ పూజ ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, ఖుష్బూ ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) పోస్ట్ చేశారు.
విష్ణు మాయ ఆలయంలో నారీ పూజ కోసం తనను ఆహ్వానించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఖుష్బూ చెప్పుకొచ్చారు. ఈ పూజలో ఎంపిక చేయబడిన వారు మాత్రమే ఆహ్వానితులని చెప్పారు. వారిని ఆ దైవమే ఎంపిక చేస్తుందని ఆలయ నిర్వాహకుల నమ్మకమన్నారు. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చింది ఆ దైవమేనని అనుకుంటానని అన్నారు. ఇలాంటి గౌరవాన్ని తనకు కల్పించిన ఆలయ నిర్వాహకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నిత్యం ప్రార్థించే వారికి, మనల్ని కాపాడడానికి ఒక సూపర్ శక్తి ఉంటుందని నమ్మేవారికి, పూజ మరింత మంచిని కలగజేస్తుందని తాను నమ్ముతున్నాను అని పేర్కొన్నారు. ఆమె పూజలో పాల్గొన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.