చాన్నాళ్లుగా భారతీయ జనతాపార్టీని(BJP) అంటిపెట్టుకుని ఉంటూ, ఆ పార్టీకి ఎంతో కొంత ఊపును తెచ్చిన సినీనటి ఖుష్బూ(Kushbhu) భారమైన హృదయంతో ఎన్నికల ప్రచారం(Election campaing) నుంచి తప్పుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలైన ఖుష్బూ ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది.

చాన్నాళ్లుగా భారతీయ జనతాపార్టీని(BJP) అంటిపెట్టుకుని ఉంటూ, ఆ పార్టీకి ఎంతో కొంత ఊపును తెచ్చిన సినీనటి ఖుష్బూ(Kushbhu) భారమైన హృదయంతో ఎన్నికల ప్రచారం(Election campaing) నుంచి తప్పుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలైన ఖుష్బూ ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది. ఈసారి తమిళనాడు నుంచి లోక్‌సభకు పోటీ చేద్దామని ఆమె ఆశించారు. కానీ బీజేపీ అధినాయకత్వం ఖుష్బూకు మొండిచేయి చూపించింది. ఇది ఆమెను బాగా బాధించింది. అందుకే కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. అయితే అధిష్టానం ఆదేశాల మేరకు కొద్ది రోజుల కిందటే ప్రచారానికి సిద్ధమయ్యారు. అన్యమనస్కంగానే ప్రచారం చేస్తూ వచ్చారు. శనివారంనాడు దక్షిణ చెన్నై బీజేపీ అభ్యర్థి తమిళిసైకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు ఖుష్బూ. మళ్లీ ఏం జరిగిందో ఏమో కానీ ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నానని జేపీ నడ్డాకు ఓ లేఖ రాశారు ఆమె! సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్న ఖుష్బూను కాదని నిన్నమొన్న పార్టీలో చేరిన మరో సీనియర్‌ నటి రాధికా శరత్‌కుమార్‌కు లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది బీజేపీ అధినాయకత్వం. ఇది ఖుష్బూను బాధించింది. లోలోపల కుమలిపోయారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై, ఎల్‌.మురుగన్‌, తమిళిసై, రాధికలకు సీట్లు ఇచ్చింది బీజేపీ.ఈ లెక్కన ఖుష్బూకు కూడా టికెట్‌ ఇవ్వాల్సి ఉండాలి. కానీ ఇవ్వలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి లోక్‌సభకు పోటీ చేయాలనుకున్నారు. చెన్నై మహానగరంలోని మూడు లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని ఖుష్బూకు ఇస్తారనుకున్నారంతా! కానీ బీజేపీ ఆ పని చేయలేదు. ఖుష్బూకు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. తమిళనాడు ప్రభుత్వం మహళలకు ప్రతి నెలా ఇస్తున్న వెయ్యి రూపాయలను ఖుష్బూ భిక్షగా అభివర్ణించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. పార్టీ అధిష్ఠానానికి కోపం తెప్పించాయట! రాష్ట్రంలోని మహిళలు కూడా ఖుష్బూ పట్ల సానుకూలంగా లేరట! అందుకే టికెట్‌ ఇవ్వలేదని చెబుతున్నాయి బీజేపీ వర్గాలు.

Updated On 8 April 2024 4:26 AM GMT
Ehatv

Ehatv

Next Story