తమిళనాడులో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నటి, బీజేపీ నాయకురాలు గౌతమి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ విడుదల చేశారు.
తమిళనాడు(Tamilnadu)లో బీజేపీ(BJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నటి, బీజేపీ నాయకురాలు గౌతమి(Gautami Tadimalla) బీజేపీకి రాజీనామా(Resign) చేశారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ(Letter) విడుదల చేశారు. చాలా బరువెక్కిన హృదయంతో బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గౌతమి లేఖలో పేర్కొన్నారు. 25 సంవత్సరాల క్రితం పార్టీలో చేరాను. నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ.. పార్టీలో నిబద్ధతతో పనిచేశాను. అయితే ఈ రోజు నేను ఊహించలేని సంక్షోభంలో ఉన్నాను. పార్టీ నుంచి, నేతల నుంచి నాకు ఎలాంటి మద్దతు లభించలేదు. తనను నమ్మించి మోసం చేసిన వ్యక్తికి కొందరు మద్దతిస్తున్నారని తెలిసి.. పార్టీని వీడుతున్నట్లు గౌతమి లేఖలో వివరించారు. సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin), పోలీసు శాఖ, న్యాయవ్యవస్థ తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు ఇంకా ఉందని పేర్కొన్నారు.