దేశ ప్రజలంతా ఎదురు చూస్తు్న్న అయోధ్య(Ayodhya) రామమందిర(Ram mandir) ప్రారంభోత్సవానికి వారం రోజులు మాత్రమే ఉంది. ఈ మహా క్రతువుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ఈ నెల 16 నుంచే మొదలు కానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో 22న రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జగరగనుంది

ఈ నేపధ్యంలో జనవరి 14 నుండి 22 వరకు జగద్గురు రామానందాచార్యస్వామి రామభద్రాచార్య అమృత మహోత్సవం అయోధ్యలో జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి, బీజేపీ(BJP) ఎంపీ హేమమాలినితో(Hema Malini) సహా పలువురు కళాకారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తను ప్రత్యేక నృత్య ప్రదర్శను(Dance Performance) ఇవ్వనున్నట్లు నటి హేమమాలిని స్వయంగా చెప్పారు. రామాయణం ఆధారంగా ఉండే ఈ నృత్యరూపకాలన్ని ప్రదర్శించే అవకాశం తనకు లభించిందని హేమమాలిని ఒక వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. ఇక ఈ వేడుకలకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి భోజనం, వసతితోపాటు అవసరమైన సౌలతులు కల్పిస్తున్నారు.