కేరళలోని(Kerala) త్రిసూర్‌(Trisur) లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బీజేపీ(BJP) అభ్యర్థి, సినీ నటుడు సురేశ్‌ గోపీ(Suresh gopi) ఆదివారం కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలైనా పూర్తి కాలేదు.

కేరళలోని(Kerala) త్రిసూర్‌(Trisur) లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన బీజేపీ(BJP) అభ్యర్థి, సినీ నటుడు సురేశ్‌ గోపీ(Suresh gopi) ఆదివారం కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలైనా పూర్తి కాలేదు. అప్పుడే ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
పెండింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌ల‌ను(Movies shooting) పూర్తి చేసేందుకు సురేశ్‌ గోపీ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. త‌న‌కు స‌హాయ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని సురేశ్‌ గోపీ జీర్ణించుకోలేక‌పోతున్నారని, అందుకే పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్టు కొందరు చెప్పుకుంటున్నారు. కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి న‌న్ను రిలీవ్ చేస్తార‌ని భావిస్తున్నాన‌ని, ఒప్పుకున్న సినిమాల‌ను పూర్తి చేయాల్సి ఉంద‌ని, ఈ అంశంపై కేంద్ర నాయ‌క‌త్వ‌మే నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని సురేశ్‌ గోపీ తెలిపారు. ఒక ఎంపీగా తాను త్రిసూరులో మెరుగైన సేవ‌లు అందిస్తాన‌ని, త‌న‌కు క్యాబినెట్ పొజిష‌న్(Cabinet position) అవ‌స‌రం లేద‌ని సురేశ్ గోపీ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు ఢిల్లీకి రావాల‌ని పిలిచిన‌ప్పుడు తన సినిమా కమిట్‌మెంట్ల గురించి బీజేపీ కేంద్ర నాయకత్వానికి సురేశ్‌ గోపీ చెప్పారట! ప్రస్తుతం సురేశ్‌ గోపీ నాలుగు సినిమాలలో నటిస్తున్నారు. ఇందులో పద్మనాభ స్వామి ఆలయంపై తీస్తున్న చారిత్రాత్మక సినిమా కూడా ఉంది. తాను సినిమాలను ఆపేస్తే సినిమా ఇండస్ట్రీ సిబ్బంది సంక్షోభంలో వెళతారని సురేశ్‌ గోపీ చెప్పుకొచ్చారు. సినిమాల కోసం కేంద్ర మంత్రి ప‌ద‌విని త్యాగం చేయ‌డం మూర్ఖ‌త్వం అవుతుంద‌ని సురేశ్ గోపికి కొందరు చెప్పి చూశారట!

Updated On 10 Jun 2024 7:41 PM GMT
Ehatv

Ehatv

Next Story