ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి అందరికి తెలిసిందే. ఈప్రమాదంతో ఒక్క సారిగా భారత దేశం ఉలిక్కిపడింది. ఇప్పటికే దాదాపు 290కి పైగా మృతి చెందినట్లు, వెయ్యి మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి రాజకీయ నాయకులతో పాటు..ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది స్పందిస్తున్నారు. స్టార్లు వారి అభిమానులకు ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు కూడా వారికి సాయంచేశారు. ఇక ఈ విషయంలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్.. ఇలా పెద్ద తారలంతా స్పందించారు.
సామాజిక అంశాలపై ఎప్పుడ స్పందిస్తుంటారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఆయన చేస్తున్న సేవల గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఆయన రైల్వే యాక్సిడెంట్ గురించ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి అందరికి తెలిసిందే. ఈప్రమాదంతో ఒక్క సారిగా భారత దేశం ఉలిక్కిపడింది. ఇప్పటికే దాదాపు 290కి పైగా మృతి చెందినట్లు, వెయ్యి మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి రాజకీయ నాయకులతో పాటు..ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది స్పందిస్తున్నారు. స్టార్లు వారి అభిమానులకు ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు కూడా వారికి సాయంచేశారు. ఇక ఈ విషయంలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్,మెగాస్టార్ చిరంజీవి,ఎన్టీఆర్,మహేష్. ఇలా పెద్ద తారలంతా స్పందించారు.
ఇక ఈ ప్రమాదం గురించి రియల్ హీరో సోనూసూద్ డిఫరెంట్ గా స్పందించారు. ఆయన తన సోషల్ మీడియా పేజ్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. బాధుల పక్షాన ఆయన సంచలన ట్వీట్ చేశాడు. ట్రైన్ యాక్సిడెంట్ గురించి తెలియగానే నా గుండె ముక్కలైంది. ప్రమాద బాధితులకు సానుభూతి తెలుపుతున్నాను. మనందరం వారి కుటుంబాలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ట్యాగ్ లైన్ తో ఆ వీడియోను పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో సోను సూద్ సంచలన విషయాలు మాట్టాడారు. ఆయన ఏమన్నారంటే.. మనం ఈ రోజు ప్రమాదం గురించి తెలుసుకొని నష్టపోయిన వారిపట్ల సానుభూతి చూపిస్తాం. కానీ కొన్ని రోజులకు ఈ విషయాన్ని మనం మర్చిపోతాం.. గతంలో ఎన్నో ప్రమాధాల విషయంలో ఇలానేజరిగింది. కాని ఆతరువాత వారి జీవితం ఏంటీ అనేది ఎవరూ పట్టించుకోరు. కానీ వీరిలో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలను పోషించలేని వారి పరిస్థితి ఏంటి..? ? ఈ ప్రమాదం వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయి. ఆ కుటుంబాలు మళ్ళీ నిలబడతాయా అని ప్రశ్నించారు.
అంతే కాదు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నష్టపరిహారం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి.. కాని వారికి జీవితాతం ఎవరు అండగా ఉంటారు. ఇచ్చిన పరిహారం రెండు మూడు నెలల్లో అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వారి పరిస్థితి ఏంటి? ఈ ప్రమాదంలో తమ కుటుంబాన్ని పోషించే వారి కాళ్ళు, చేతులు తెగిపోయాయి. ప్రభుత్వాలు ఇచ్చే నష్టపరిహారంతో వారికి న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు సోనూ.. అంతే కాదు ఇలాంటి వాటికి మంచి పరిష్కారాలు కావాలి అన్నారు.
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏదో నష్ట పరిహారం చెల్లించి వదిలేయకుండా వారికి పెన్షన్స్ కానీ, స్థిరాదాయం కల్పించడం కానీ చేస్తేనే వారికి భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయం అని సలహా ఇచ్చారు రియల్ హీరో. ప్రస్తుతం సోనూసూద్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Heartbroken by the news of the train tragedy in Odisha. Heartfelt deepest condolences 💔🙏
Time to show our support and solidarity for the unfortunates. 💔#OdishaTrainAccident 🇮🇳 pic.twitter.com/ZfuYYp8HK9— sonu sood (@SonuSood) June 3, 2023