కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీని(BJP) ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash Raj) తీవ్రంగా విమర్శించారు. 420లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో(General election) 400 సీట్లు గెలుస్తామని చెబుతున్నారని, ఇవి అహంకారంతో కూడిన మాటలని ఆగ్రహించారు. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400 కంటే ఎక్కువ సీట్లు గెల్చుకునే అవకాశం లేదని ప్రకాశ్‌రాజ్ అన్నారు. ప్రధాని మోదీ(Narendra modi), బీజేపీ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీని(BJP) ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash Raj) తీవ్రంగా విమర్శించారు. 420లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో(General election) 400 సీట్లు గెలుస్తామని చెబుతున్నారని, ఇవి అహంకారంతో కూడిన మాటలని ఆగ్రహించారు. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ 400 కంటే ఎక్కువ సీట్లు గెల్చుకునే అవకాశం లేదని ప్రకాశ్‌రాజ్ అన్నారు. ప్రధాని మోదీ(Narendra modi), బీజేపీ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని 420లు అంటున్నారు. అలా చెప్పడం అహంకారమే అవుతుంది. ఆ పార్టీ నేత తమ పార్టీ ఇన్ని సీట్లు గెలుస్తామని ఎలా చెబుతుంది? అలా చెప్పడం ముమ్మాటికి అహంకారమే అవుతుంది’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు. కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి రావాలనుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాలకు పైగా గెల్చుకుంటుందని, ఎన్టీయేకు 400 స్థానాలపై చిలుకు లభిస్తాయిన ప్రధాని మోదీ ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్డీయే నేతలు కూడా ఇదే భావనతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఫిబ్రవరి 5వ తేదీన రాజ్యసభలో ప్రధాని మోదీ కూడా చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటానికి సమయం దగ్గరకొచ్చేసింది. ఈ సారి 400 సీట్లు గెలుస్తాం. దేశం మొత్తం అబ్కీ బార్, 400 పార్ అంటోంది’ అని మోదీ అన్నారు. మోదీ మాటలకు కౌంటర్ ఇస్తూ ప్రకాశ్‌రాజ్ పై విధంగా వ్యాఖ్యయలు చేశారు.