ఇస్రో(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3(Chandrayan-3) మరికొద్ది గంటలో చంద్రుడిపై(Moon) అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టనుంది. దీనికి సంబందించిన ఫోటోలని ఇప్పటికే ఇస్రో తమ సోషల్ మీడియా లో(Social media) పోస్ట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ విజయవంతం అయితే ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఈనెల 23న సాయంత్రం 6.04 గంటల సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువ ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ అడుగిడుతుందని ఇస్రో తెలిపింది.

ఇస్రో(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3(Chandrayan-3) మరికొద్ది గంటలో చంద్రుడిపై(Moon) అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టనుంది. దీనికి సంబందించిన ఫోటోలని ఇప్పటికే ఇస్రో తమ సోషల్ మీడియా లో(Social media) పోస్ట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ విజయవంతం అయితే ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఈనెల 23న సాయంత్రం 6.04 గంటల సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువ ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ అడుగిడుతుందని ఇస్రో తెలిపింది. రష్యా(Russia) లూనా-25(LUNA-25) ప్రయోగం విఫలం కావడంతో, ప్రపంచ దేశాలన్నీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 వైపు చూస్తున్నాయి. దేశం మొత్తం చంద్రయాన్-3 గురించి మట్లాడుకుంటున్న,ఈ సమయంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) తన ట్విటర్లో ఓ ఫొటోను షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘బ్రేకింగ్ న్యూస్.,చంద్రుడినుంచి వస్తున్న మొదటి చిత్రం వావ్’ అంటూ, . ఓ వ్యక్తి లుంగీతో ఉండి టీ పోస్తున్నట్లు, చాయ్ వాలాను పోలి ఉన్న ఫోటో ని ప్రకాశ్ రాజ్ షేర్ షేర్ చేసారు. ప్రధాని నరేంద్ర మోదీని(Narendra Modi) ఉద్దేశించి ఈ పోస్టు పెట్టినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ప్రకాశ్ రాజ్ పోస్టు ఉండటంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

చంద్రయాన్-3 భారతదేశానికి గర్వకారణం. కానీ దీన్నికూడా ప్రకాశ్ రాజ్ అతని రాజకీయ ద్వేషం కోసం వాడుకుంటూ, శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

చంద్రయాన్ మిషన్ ఇస్రో ప్రయోగించింది., అది బీజేపీది కాదు. మీరు విమర్శించాలనుకుంటే రాజకీయ పార్టీలను విమర్శించండి ఇండియాను కాదు అంటూ ప్రకాశ్ రాజ్ కి ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై బీజేపీ నేతలుసైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Updated On 21 Aug 2023 3:58 AM GMT
Ehatv

Ehatv

Next Story