మలయాళ (Malayalam)చిత్ర పరిశ్రమలో మహిళలకు వేధింపులు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అందులోని నిజాలను నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం జస్టిస్‌ హేమ(Justice Hema)సారథ్యంలో ఓ కమిటీ వేసింది. ఇటీవలే ఆ కమిటీ నివేదిక బయటకు వచ్చింది.

మలయాళ (Malayalam)చిత్ర పరిశ్రమలో మహిళలకు వేధింపులు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అందులోని నిజాలను నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం జస్టిస్‌ హేమ(Justice Hema)సారథ్యంలో ఓ కమిటీ వేసింది. ఇటీవలే ఆ కమిటీ నివేదిక బయటకు వచ్చింది. నివేదికలో ఉన్న అంశాలు మలయాళ సినీ పరిశ్రమలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. చాలా మంది మహిళ ఆర్టిస్టులు ఇప్పుడు బహిరంగంగా తమ ఆవేదనను, తాము ఎదుర్కొన్న ఇబ్బందులను చెబుతున్నారు. మాలీవుడ్‌(Maliwood) నటి రేవతి సంపత్‌ (Revathi sampath)చేసిన వ్యాఖ్యలతో మలయాళ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (Association of Malayalam Movie Artists) ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్‌ నటుడు సిద్ధిఖీ(Sidiki) తన పదవికి రాజీనామా చేశాడు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు మోహన్‌లాల్‌(Mohanlal)కు అందించాడు. సిద్ధిఖీ తనను ట్రాప్‌ చేసి రేప్‌ చేశాడంటూ రేవతి సంపత్‌ చేసిన ఆరోపణల కారణంగానే తాను పదవి నుంచి వైదొలుగుతున్నానని సిద్దిఖీ చెప్పాడు. అయితే లేటెస్ట్‌గా ఈ వ్యవహారంలో అధ్యక్షుడు మోహన్‌లాల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్‌ కమిటీనీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ AMMA ఎగ్జిక్యూటివ్‌ కమిటీని రద్దు చేయాలని నిర్ణయించామని మోహన్‌లాల్‌ తెలిపారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించిన అనంతరం కొత్త కమిటీ ఏర్పాటవుతుందని అసోసియేషన్‌ తెలిపింది. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో జగదీష్‌(Jagadeesh), సూరజ్‌ వెంజరమూడు(Suraj Venjaramoodu), టొవినో థామస్‌(Tovino Thomas)లాంటి పాపులర్‌ నటులు ఉన్నారు. ఇదిలా ఉంటే రేవతి సంపత్‌ చేసిన వ్యాఖ్యలపై సిద్ధిఖీ పోలీసులకు కంప్లయింట్‌ చేశాడు. రేవతి సంపత్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని అన్నాడు. ఆమె కుట్రలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.

ehatv

ehatv

Next Story