బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) తన వృత్తి జీవితం కంటే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది.
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) తన వృత్తి జీవితం కంటే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో(Sukesh Chandrashekar) జాక్వెలిన్ స్నేహం వివాదాస్పదమైంది. సుకేష్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో(Money Launering case) జాక్వెలిన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) టార్గెట్‌గా మిగిలిపోయింది. తాజాగా ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి ఈడీ మళ్లీ సమన్లు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు జాక్వెలిన్‌ను ఈడీ మరోసారి విచారించనున్నట్లు తెలుస్తుంది.
తాజాగా రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ బాంబే హైకోర్టులో బెయిల్ పొందాడు. అయితే అతనిపై నమోదైన ఇతర కేసులను దృష్ట్యా ప్రస్తుతానికి జైలులోనే ఉంచారు. సుకేష్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. దాదాపు 9 ఏళ్ల నాటి ఈ కేసుకు సంబంధించి నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు కూడా ఉంది. ఈ కేసు విషయమై గత 2-3 సంవత్సరాలుగా ఆమె తరచుగా ED కార్యాలయం, కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్‌కు సమన్లు పంపినట్లు బుధవారం వార్తా సంస్థ ANI తెలిపింది.
నిందితుడు సుకేష్ రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను చాలాసార్లు ప్రశ్నించింది. ఈడీ విచారణలో జాక్వెలిన్ సుఖేష్ చంద్రశేఖర్‌తో తన సంబంధాలపై క్లారిటీ ఇచ్చింది. 2022లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత పలుమార్లు కోర్టు చుట్టూ తిరిగారు. ఈ వివాదం కారణంగా ఆమె సినీ కెరీర్ కూడా మసకబారింది.