ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ(MP Prajwal Revanna) అశ్లీల పెన్‌డ్రైవ్‌ సంఘటన దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. తాను అమాయకుడినని అని ప్రజ్వల్‌ చెప్పుకుంటున్నారు కానీ అతగాడు చేసిన దారుణాలు వీడియోల రూపంలోనే ఉన్నాయి. ప్రజ్వల్‌ లాంటి కామాంధుడు ఒకడు ఉడుపిలో(Udupi) బయటపట్టాడు. వ్యాపారవేత్త శ్రేయస్‌ నాయక్‌(Shreyas Nayak) పలువురు బాలికలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ(MP Prajwal Revanna) అశ్లీల పెన్‌డ్రైవ్‌ సంఘటన దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. తాను అమాయకుడినని అని ప్రజ్వల్‌ చెప్పుకుంటున్నారు కానీ అతగాడు చేసిన దారుణాలు వీడియోల రూపంలోనే ఉన్నాయి. ప్రజ్వల్‌ లాంటి కామాంధుడు ఒకడు ఉడుపిలో(Udupi) బయటపట్టాడు. వ్యాపారవేత్త శ్రేయస్‌ నాయక్‌(Shreyas Nayak) పలువురు బాలికలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. పాతికేళ్ల శ్రేయస్‌పై పోలీసులు పోక్సో(POCSO) కేసు నమోదు చేయడంతో అతడు పరారయ్యాడు. ఉడిపి జిల్లాలోని కుందాపుర(Kundapura) తాలూకాలో అమావాస్యె బైలు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. గత ఏడాది నుంచి కాలేజీ విద్యార్థులను మాయమాటలు చెప్పి లైంగిక దాడులకు పాల్పడుతున్నాడట! వారిని ఉడుపిలో హాలాడి రోడ్డులోని హెగ్గూడ్లులోని ప్రాంతానికి తీసుకెళ్లి కారులో అత్యాచారం చేసేవాడు. ఆ లైంగికదాడిని వీడియోలు తీసేవాడు. ఆ వీడియోలను చూపించి తను పిలిచినప్పుడు రావాలని బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. ఒక బాలిక అతని వల్ల గర్భవతి కూడా అయ్యింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మే 18న పోక్సో కేసు నమోదైంది. ఆ తరువాత విచారణలో అతని అకృత్యాలు ఒక్కొక్కటే వెలుగుచూశాయి. తనపై పోక్సో కేసు నమోదయ్యిందని తెలియడంతో శ్రేయస్‌ పారిపోయాడు. ఇప్పుడతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated On 3 Jun 2024 1:45 AM GMT
Ehatv

Ehatv

Next Story