మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ(Deve Gowda) మనవడు ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) మామూలోడు కాదు. కర్ణాటక(Karnataka)లోని హసన్ నియోజకవర్గం నుంచి ఎన్టీయే తరఫున పోటీ చేస్తున్న ఇతగాడు పెద్ద కామాంధుడు. ఇతగాడి శృంగారలీలల కథలు చాన్నాళ్లుగా వినిపిస్తున్నా ఇప్పటికీ బండారం బట్టబయలయ్యింది.

Obscene Videos Case
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ(Deve Gowda) మనవడు ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) మామూలోడు కాదు. కర్ణాటక(Karnataka)లోని హసన్ నియోజకవర్గం నుంచి ఎన్టీయే తరఫున పోటీ చేస్తున్న ఇతగాడు పెద్ద కామాంధుడు. ఇతగాడి శృంగారలీలల కథలు చాన్నాళ్లుగా వినిపిస్తున్నా ఇప్పటికీ బండారం బట్టబయలయ్యింది. పాపం అప్పటికీ కర్ణాటక బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు ప్రజ్వల్ ఖత్తర్‌నాక్ అని, అతడితో చేతులు కలపవద్దని పార్టీ అధినాయకత్వానికి నెత్తినోరుకొట్టుకుని చెప్పారట! వారు వింటేగా! మొత్తం మీద ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలు సోషల్ మీడియాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇది మామూలు స్కామ్ కాదు. దీన్ని స్కామ్ అని అనకూడదు. ఇది భయంకరమైన నేరం! కర్ణాటకలో ఇంతకు ముందు కూడా పొలిటిషియన్లకు సంబంధించిన సెక్స్ వీడియోలు దుమారం రేపాయి! వాటితో పోలిస్తే ఇవి ఎంత అని ప్రజ్వల్ సమర్థకులు చెప్పుకున్నా అతడు చేసింది ఘోరమైన పాపమని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అందుకే చెప్పాపెట్టకుండా జర్మనీకి పారిపోయాడు. కుటుంబపార్టీ అయిన జేడీఎస్ నుంచే అతడిని సస్పెండ్ చేశారంటే అతడు చేసింది ఎంత పెద్ద నేరమో అర్థమవుతోంది. హసన్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ అయిపోయింది కానీ ఇప్పుడు జరిగితే మాత్రం అతడికి డిపాజిట్ కూడా దక్కదేమో! ప్రజ్వల్ పెన్‌డ్రైవ్‌లో రెండు వేలకు పైగా సెక్స్ వీడియోలు ఉన్నాయట! అవన్నీ అతడు తన ఫోన్‌తో తీసుకున్నవేనట! మద పిచ్చి కాకపోతే ఇన్నేసి వీడియోలను అతడు ఎందుకు భద్రంగా పెట్టుకున్నట్టు? రోజూ వాటిని చూసి ఆనందపడటానికా? పెన్‌డ్రైవ్‌లోనే రెండు వేల వీడియోలు ఉన్నాయంటే అతడి కామానికి ఇంకా ఎంత మంది బలై ఉంటారో?
