తమిళనాడుకు(Tamilnadu) చెందిన ఓ మహిళ తన విశాలహృదయాన్ని చాటుకుంది. ప్రభుత్వ మహిళా పాఠశాల(Government Girl schoool) కోసం తన పేరు మీద ఉన్న ఎకరం భూమి విరాళంగా(Land Donation) ఇచ్చింది. ఆ భూమి విలువ అక్షరాల ఏడు కోట్ల రూపాయలు.

తమిళనాడుకు(Tamilnadu) చెందిన ఓ మహిళ తన విశాలహృదయాన్ని చాటుకుంది. ప్రభుత్వ మహిళా పాఠశాల(Government Girl schoool) కోసం తన పేరు మీద ఉన్న ఎకరం భూమి విరాళంగా(Land Donation) ఇచ్చింది. ఆ భూమి విలువ అక్షరాల ఏడు కోట్ల రూపాయలు. తమిళనాడులోని మదురైకి(Madurai) చెందిన ఓ మహిళ ప్రభుత్వ మహిళా స్కూల్‌ కోసం భూమి విస్తరణ చేయాల్సి ఉండగా దాని పక్కనే ఉన్న తన భూమిని ఆమె ఇచ్చింది.

ఆయిపురాణం అమ్మాళ్‌(Aipurana Ammal) అనే మహిళ తన దాతృత్వం చాటడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. ఈనెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం స్టాలిన్‌ చేతుల మీదుగా ఆమె సత్కారం పొందనుంది. మదురైలోని కోడిక్కుళానికి చెందిన అమ్మాల్ ఓ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తోంది. ఒట్టకడైలో ఆమెకు ఎకరం భూమి ఉండడంతో మహిళా పాఠశాల విస్తరణ కోసం దానిని దానం అమ్మాళ్ దానం చేసింది. దీనిపై స్థానికులు స్పందిస్తూ ఆమెను ప్రశంసిస్తున్నారు. సోషల్‌ మీడియాలో అమ్మాళ్‌ను పొగుడుతూ పోస్టులు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. దీనిపై స్టాలిన్ స్పందిస్తూ అమ్మాళ్ విరాళం వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. విద్య, బోధన అత్యున్నత ధర్మంగా భావించే తమిళ సమాజానికి ప్రతీకగా నిలిచిన ఈ అమ్మాళ్‌కు రానున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరిస్తామని సీఎం స్టాలిన్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు.

Updated On 16 Jan 2024 3:32 AM GMT
Ehatv

Ehatv

Next Story