ఈడీ బృందం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంటికి చేరుకుంది. చాలా మంది ఈడీ అధికారులు ఈ ఉద‌యం సంజయ్ సింగ్ ఇంటి వెలుపల కనిపించారు. అంతేకాకుండా అక్కడ భారీగా భద్రతా బలగాలు కూడా ఉన్నాయి.

ఈడీ బృందం(Enforcement Directorate) ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh) ఇంటికి చేరుకుంది. చాలా మంది ఈడీ అధికారులు ఈ ఉద‌యం సంజయ్ సింగ్ ఇంటి వెలుపల కనిపించారు. అంతేకాకుండా అక్కడ భారీగా భద్రతా బలగాలు కూడా ఉన్నాయి. ఈడీ అధికారులు సంజయ్ సింగ్ ను విచారించ‌నున్నారు. అయితే సంజ‌య్ సింగ్‌ను ఏ కేసులో విచారిస్తున్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు. మూలాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు(Delhi Liquor Scam )లో సంజయ్ సింగ్‌ను ఈడీ అధికారులు విచారించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం సంజ‌య్ సింగ్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం సంజయ్ సింగ్ ఇంటికి వెళ్ల‌డం ఇది రెండోసారి.

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో సంజయ్ సింగ్ పేరు ప్రస్తావించబడింది. చివరిసారి ఈడీ బృందం సంజయ్ సింగ్ ఇంటికి వెళ్లిన‌ప్పుడు ఈడీపై పరువు నష్టం కేసు పెట్టారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ క్లారిటీ ఇస్తూ.. ఛార్జిషీట్‌లో రాహుల్ సింగ్ స్థానంలో సంజయ్ సింగ్ పేరు తప్పుగా రాసిందని పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం అక్కడితో ముగియగా.. ఇప్పుడు మరోసారి సంజయ్ సింగ్ ఇంటికి ఈడీ వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Updated On 3 Oct 2023 9:46 PM GMT
Yagnik

Yagnik

Next Story