మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ వీధుల్లోకి వచ్చింది.

AAP Announces Siege Of PM Residence In Protest Against Arvind Kejriwal’s Arrest
మద్యం కుంభకోణం కేసు(Liquor Scam Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ వీధుల్లోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఇతర రాజకీయ పార్టీలు కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా దేశ రాజధానితో సహా దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించాయి. ఈసారి హోలీ జరుపుకోవద్దని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించడంతో పలు చోట్ల బీజేపీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసింది.
తాజాగా ఆప్ ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టేందుకు సన్నాహాలు చేసింది. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా మంగళవారం ప్రధాని నివాసం ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్లాన్ చేసింది. అలాగే.. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మార్చి 31 న రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని ప్రకటించాయి.
ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. 'అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా ఆప్ కుటుంబ సభ్యులు. అందుకే ఈ ఏడాది హోలీ జరుపుకోకూడదని పార్టీ నిర్ణయించింది. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన తర్వాతే హోలీ జరుపుకుంటాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సమయంలో సిట్టింగ్ సిఎం, జాతీయ పార్టీ జాతీయ కన్వీనర్‌ను అరెస్టు చేశారు. ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. మార్చి 31న రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని విపక్షాలన్నీ నిర్ణయించాయన్నారు.
