ఆమ్‌ ఆద్మీ పార్టీ(Aam Admi Party) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై(Swathi maliwal) దాడి ఘటన తీవ్ర దుమారం రేపింది. జాతీయ ఛానెళ్లన్నీ విస్తృతంగా ప్రసారం చేశాయి. డిబేట్లు కూడా పెట్టాయి. ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(Arvindh Kejrival) ప్రతిష్టను దిగజార్చడానికి ఎంత చేయాలో అంతా చేశాయి. ఈ నెల 13వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనపై దాడి చేసినట్టు స్వాతి మలివాల్‌ ఆరోపించారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ(Aam Admi Party) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై(Swathi maliwal) దాడి ఘటన తీవ్ర దుమారం రేపింది. జాతీయ ఛానెళ్లన్నీ విస్తృతంగా ప్రసారం చేశాయి. డిబేట్లు కూడా పెట్టాయి. ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌(Arvindh Kejrival) ప్రతిష్టను దిగజార్చడానికి ఎంత చేయాలో అంతా చేశాయి. ఈ నెల 13వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనపై దాడి చేసినట్టు స్వాతి మలివాల్‌ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కేజ్రీవాల్‌ ఇంట్లో భద్రతా సిబ్బందితో స్వాతి మలివాల్‌ వాగ్వాదానికి దిగిన వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా మరో వీడియోను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేసింది. ఇందులో కేజ్రీవాల్‌ ఇంట్లోంచి సెక్యూరిటీ సిబ్బంది స్వాతిని బయటకు పంపిస్తున్నట్లు ఉంది. ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మామూలుగానే ఉన్నారు. ఎక్కడా దెబ్బలు తగిలినట్లు కనిపించడం లేదు. చాలా క్యాజువల్‌గా నడుచుకుంటూ బయటకు వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న పోలీసులతో మాట్లాడటం కూడా వీడియోలో కనిపిస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ వీడియోని శనివారం ఎక్స్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. కోర్టు ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు స్వాతి వెళ్తున్న వీడియోని కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీ పోస్టు చేసింది. ఈ వీడియోలో మాత్రం ఆమె మెట్లు దిగుతూ కుంటుతూ కనిస్తున్నది. ‘ స్వాతి మలివాల్ ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని ఈ వీడియో బట్టబయలు చేస్తుంది’ అంటూ వీడియోలకు క్యాప్షన్‌ను జోడించింది ఆప్‌. ఇదిలా ఉంటే స్వాతి మలివాల్‌ కంప్లయింట్‌కు పోలీసులు రియాక్టయ్యారు. బిభన్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు.

Updated On 18 May 2024 3:17 AM GMT
Ehatv

Ehatv

Next Story