దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) నీటి సంక్షోభం(Water storage) సృష్టించడానికి భారతీయ జనతాపార్టీ(BJP) కుట్ర చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సంచలన ఆరోపణ చేసింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు(Lok sabha ELection Polling) కొన్ని రోజుల సమయం ఉందనగా బీజేపీ ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతున్నదని ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి ఆరోపించారు.

AAP Athishi
దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) నీటి సంక్షోభం(Water crises) సృష్టించడానికి భారతీయ జనతాపార్టీ(BJP) కుట్ర చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సంచలన ఆరోపణ చేసింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు(Lok sabha ELection Polling) కొన్ని రోజుల సమయం ఉందనగా బీజేపీ ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతున్నదని ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి ఆరోపించారు. ఇందులో భాగంగానే హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి నీటి సరఫరాను నిలిపివేసిందని ఆతిషి చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు ప్రకటించగానే తమ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని, ప్రచారం కోసం ఆయనకు మధ్యంతర బెయిల్ రాగానే స్వాతి మలివాల్‌పై దాడి అనే నాటకానికి తెరతీశారని, ఇది కూడా వర్కవుట్ కాకపోవడంతో విదేశీ నిధులు వచ్చాయంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నదని ఆతిషి అన్నారు. తాజాగా హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందు ఢిల్లీకి యమునా నది నీళ్లు ఆపివేశారని మండిపడ్డారు.
