ఆధార్ కార్డ్(Aaddar card), పాన్ కార్డ్(pan card) ఇప్పుడు ఈ రెండింటిని లింక్ చేయడం తప్పనిసరి. ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలలో చిక్కుకోకుండా ఉండాలంటే ఆధార్, పాన్ కార్డ్ లింక్ వెంటనే చేయాలి. ఇప్పటికే దేశంలో అనేక మంది ఈ ప్రక్రియను పూర్తిచేయగా.. ఇంకా కంప్లీట్ చేయనివారికోసం ప్రభుత్వం గడువును మరిన్ని రోజులు పెంచింది.

ఆధార్ కార్డ్(Aaddar card), పాన్ కార్డ్(pan card) ఇప్పుడు ఈ రెండింటిని లింక్ చేయడం తప్పనిసరి. ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలలో చిక్కుకోకుండా ఉండాలంటే ఆధార్, పాన్ కార్డ్ లింక్ వెంటనే చేయాలి. ఇప్పటికే దేశంలో అనేక మంది ఈ ప్రక్రియను పూర్తిచేయగా.. ఇంకా కంప్లీట్ చేయనివారికోసం ప్రభుత్వం గడువును మరిన్ని రోజులు పెంచింది. జూన్ 30వరకు ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయించుకోవాల్సిందే. ఒకవేళ చివరి తేదీ వరకు లింక్ చేయకపోతే.. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ పనిచేయదు. ఒకవేళ ఏదైనా పని కోసం మీరు క్లోజ్ అయిన పాన్ కార్డ్ ఉపయోగిస్తే మీకు జరిమానా విధిస్తారు. గత ఐదేళ్లలో కేంద్రం ఆధార్, పాన్ కార్డ్ లింకింగ్ కోసం దాదాపు చాలాసార్లు చివరితేదీని పొడగించారు. ప్రతి సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈ విషయంలో ఒక సర్క్యులర్ జారీ చేస్తుంది. అలాగే గడువు తేదీలోగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని నిర్ధేశిస్తుంది. అందుకు ప్రతిసారీ చివరితేదీని నిర్ణయిస్తుంది.

2017లో దీని కోసం ముందుగా జూలై 31 చివరితేదీగా ఖరారు చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఆ తర్వాత అనేకసార్లు ఈ చివరి తేదీని మార్చింది. ఇక ఇప్పుడు ఈ పని కోసం మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడగించారు. అంటే ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేయడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఆదాయపు పన్ను సెక్షన్ 1961 ప్రకారం పాన్ కార్డ్ హెల్డర్లు తమ ఆధార్ కార్డుతో లింక్ చేయడం మాత్రం తప్పనిసరి. ఒకవేళ లింక్ చేయకపోతే జరిమానా విధించే నిబంధన కూడా ఉంది. పాన్ కార్డును డీయాక్టివేట్ చేసిన తర్వాత దానిని ఉపయోగిస్తే రూ. 10వేల వరకు జరిమానా విధించవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద జరిమానా విధించవచ్చు. పాన్ కార్డ్ జంక్ అయినట్లయితే మీరు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బ్యాంక్ ఖాతాలను తెరవలేరు.

ఇంట్లోనే నిమిషాల్లో లింక్ చేయవచ్చు..
1. ముందుగా మీరు ఆదాయపు పన్ను అధికారిక వెబ్ సైట్ www.incometax.gov.inకి లాగిన్ అవ్వండి.
2. క్విక్ లింక్స్ విభాగానికి వెళ్లి లింక్ ఆధార్ పై క్లిక్ చేయాలి.
3. మీకు స్క్రీన్ పై కొత్త విండో ఓపెన్ అవుతుంది.
4. మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి..
5. I Validate my Aadhaar Details (నేను నా ఆధార్ వివరాలను ధృవీకరిస్తాను) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
6. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి ఆ తర్వాత వాలిడేట్ పై క్లిక్ చేయాలి.
7. జరిమానా చెల్లించిన తర్వాత మీ పాన్ ఆధార్ కార్డుతో లింక్ చేయబడుతుంది.

పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాడానికి జరిమానా చెల్లించాలి. ఇందుకోసం మీరు https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp పోర్టల్ ఓపెన్ చేయాలి. అక్కడ పాన్, ఆధార్ లింకింగ్ అభ్యర్థన కోసం చలాన్ నంబర్/ఐటీఎన్ఎస్ 280పై క్లిక్ చేసిన తర్వాత.. వర్తించే పన్ను ఎంచుకోండి. మైనర్ హెడ్, మేజర్ హెడ్ కింద ఒకే చలాన్ లో ఫీజు చెల్లించాలి. తర్వాత నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ నుంచి చెల్లింపు విధానాన్ని ఎంచుకుని మీ పాన్ నంబర్ ఎంటర్ చేయాలి. సంవత్సరం ఎంచుకుని చిరునామా నమోదు చేయాలి. చివరిగా క్యాప్చాను ఎంటర్ చేసి కొనసాగండి పై క్లిక్ చేయండి.

Updated On 8 Jun 2023 11:33 PM GMT
Ehatv

Ehatv

Next Story