ఓ లక్ష్యమంటూ పెట్టుకున్నాక దాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలి. అహోరాత్రాలు కష్టపడాలి. కలలు కంటే సరిపోదూ దాన్ని నిజం చేసుకోవాలి. ఈ సూత్రాన్ని త్రికరణశుద్ధిగా నమ్మాడు తమిళనాడుకు చెందిన విఘ్నేష్(Vignesh). ఈ యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు. పొట్ట తిప్పల కోసం, చేతి ఖర్చుల కోసం జొమోటో(zomato) లో చేరాడు. కానీ అతడి ధ్యేయం అది కాదు.. ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం..
ఓ లక్ష్యమంటూ పెట్టుకున్నాక దాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలి. అహోరాత్రాలు కష్టపడాలి. కలలు కంటే సరిపోదూ దాన్ని నిజం చేసుకోవాలి. ఈ సూత్రాన్ని త్రికరణశుద్ధిగా నమ్మాడు తమిళనాడుకు చెందిన విఘ్నేష్(Vignesh). ఈ యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు. పొట్ట తిప్పల కోసం, చేతి ఖర్చుల కోసం జొమోటో(zomato) లో చేరాడు. కానీ అతడి ధ్యేయం అది కాదు.. ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం.. ఉద్యోగం చేస్తూనే మిగతా సమయం పోటీ పరీక్షలకు(Tami Nadu Public service Commission exam) ప్రిపేర్ అయ్యేవాడు. అలా కష్టపడి తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాడు. ఈ విషయాన్నే జొమోటో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. తమ సంస్థలో పనిచేస్తూనే రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో రాణించిన తమ ఉద్యోగి అంటూ రాసుకొచ్చింది. తన కుటుంబంతో ఉన్న విఘ్నేష్ ఫోటోను జత చేసింది. ఈ పోస్ట్ కాస్తా చాలా వేగంగా వైరల్ అయింది. చాలా మంది విఘ్నేష్‌కు శుభాకాంక్షలు చెప్పారు. మరన్ని విజయాలు సాధించాలని కోరారు.