ఆతుకూరి మొల్ల(Athukuri Molla) తెలుసుగా! రామాయణాన్ని జాను తెలుగులో అందించిన కవయిత్రి(Poet). ఆమె సాక్షాత్తూ మహావిష్ణువునే(Lord Vishnu) మనువాడిందని అంటారు. పురాణాల్లో తప్ప మరెక్కాడా ఇలాంటివి చూడవని అనుకుంటాం. కానీ భగవంతుడినే వరించి వివాహం చేసుకోవడమనేది ఇప్పుడూ ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఝాన్సీలో(Jhansi) ఓ యువతి ఏకంగా ముక్కంటినే పెళ్లి చేసుకుంది.

A Girl Married Lord Shiva
ఆతుకూరి మొల్ల(Athukuri Molla) తెలుసుగా! రామాయణాన్ని జాను తెలుగులో అందించిన కవయిత్రి(Poet). ఆమె సాక్షాత్తూ మహావిష్ణువునే(Lord Vishnu) మనువాడిందని అంటారు. పురాణాల్లో తప్ప మరెక్కాడా ఇలాంటివి చూడవని అనుకుంటాం. కానీ భగవంతుడినే వరించి వివాహం చేసుకోవడమనేది ఇప్పుడూ ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఝాన్సీలో(Jhansi) ఓ యువతి ఏకంగా ముక్కంటినే పెళ్లి చేసుకుంది. పరమేశ్వరుడిపై ఉన్న భక్తితో శివలింగాన్నే(Shivlingam) వరుడిగా(Groom) భావించి వివాహం చేసుకుంది. అన్నపూర్ణ కాలనీకి చెందిన ఆ యువతి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. ఆ కుటుంబం బ్రహ్మకుమారి సంస్థతో అనుసంధానమై ఉంది. రోజూ శివుడి సేవలో తరించిపోయే ఆ యువతి ఆ మహేశ్వరుడిపై అపారమైన భక్తి విశ్వాసాలను పెంచుకుంది. పెళ్లంటూ చేసుకుంటే శివుడినే చేసుకోవాలనే పంతం పట్టింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ దేవదేవుడే అల్లుడవుతున్నందుకు వారు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. మంచి ముహూర్తం పెట్టారు. ఆ శుభగడియకు నెల రోజుల ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి పత్రికలు కొట్టించి బంధుమిత్రులకు పంచారు. సకుటుంబసమేతంగా రావాలని సాదరంగా ఆహ్వానించారు. పెళ్లి బట్టలు కొన్నారు. పెళ్లి మండపాలు వేయించారు. మేళతాళాలు సమకూర్చుకున్నారు. పెళ్లిని అత్యంత వైభవంగా జరిపించారు. ఈ వింత పెళ్లిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వచ్చారు.
