ఎంత మొగుడైతే మాత్రం భార్య అతగాడి కంపును ఎందుకు భరిస్తుంది చెప్పండి...
ఎంత మొగుడైతే మాత్రం భార్య అతగాడి కంపును ఎందుకు భరిస్తుంది చెప్పండి... రెండు మూడు సార్లు మంచిగా చెప్పి చూసింది. అయినా అతడు తన తీరు మార్చుకోలేదు. కోర్టుకెక్కి విడాకులు(Divorce) కోరింది ఆ భార్య. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఆగ్రాలో(Agra) జరిగింది. తన భర్త రోజూ స్నానం(Bathing) చేయడం లేదని, తనకు విడాకులు ఇప్పించాలని పెళ్లి జరిగిన 40 రోజులకే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్త నుంచి వస్తున్న దుర్వాసనను భరించలేకపోతున్నానని కోర్టుకు విన్నవించుకుంది. ఏమయ్యా నీ భార్య చెబుతున్నది నిజమేనా అని అడిగితే తాను నెలకు ఓసారో, రెండుసార్లో స్నానం చేస్తానని చెప్పుకొచ్చాడు. అధికారులు ఆ సమాధానానికి ఆశ్చర్యపోయి కౌన్సిలింగ్ ఇచ్చారు. శుభ్రంగా ఉండేందుకు అతడు ఒప్పుకున్నాడు కానీ భార్య మాత్ర అతడితో ఉండనంటే ఉండనని చెప్పేసింది. ఆ కంపును భరించడం తన వల్ల కాదని వాపోయింది.