కరోనా వైరస్‌(Corona Virus) చాలా మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అలాగే కల్యాణి జీవితంలో కూడా పెను విషాదాన్ని నింపింది. ఎంతగానో ప్రేమించే భర్త బానోతు హరిబాబును(Haribabu) ఆమె నుంచి దూరం చేసింది కరోనా! మూడేళ్ల కిందట ఈ విషాదం చోటు చేసుకోవడంతో ఆమె ఒంటరి అయ్యారు.

కరోనా వైరస్‌(Corona Virus) చాలా మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అలాగే కల్యాణి జీవితంలో కూడా పెను విషాదాన్ని నింపింది. ఎంతగానో ప్రేమించే భర్త బానోతు హరిబాబును(Haribabu) ఆమె నుంచి దూరం చేసింది కరోనా! మూడేళ్ల కిందట ఈ విషాదం చోటు చేసుకోవడంతో ఆమె ఒంటరి అయ్యారు. తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు. మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి శివారు సోమ్లాతండాకు చెందిన ఆమె ఓ స్థిర నిర్ణయానికి వచ్చారు. భర్త రూపం ఎప్పటికీ కళ్ల ముందే కనిపించడం కోసం ఆయన నిలువెత్తు విగ్రహాన్ని(Statue) తయారు చేయించారు. తన సొంత భూమిలో గుడి కట్టి అందులో ఆ విగ్రహాన్ని పెట్టారు. బానోతు హరిబాబుతో ఆమెకు 27 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. వారికి సంతానం లేదు. హరిబాబు చనిపోయిన తర్వాత ఆయన రూపం, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని అనుకున్నారు కల్యాణి. సుమారు 20 లక్షల రూపాయలతో గుడి కట్టించారు. రాజస్థాన్‌ నుంచి విగ్రహం తెప్పించి గుడిలో పెట్టారు.

Updated On 25 April 2024 2:17 AM GMT
Ehatv

Ehatv

Next Story