రెండు దశాబ్దాలుగా ఆ బావి పూర్తిగా ఎండిపోయి ఉంది. అయితే ఉన్నట్టుండి ఆ బావిలో నీరు ఉబికిబికి వస్తోంది. ఇదే వింత అనుకుంటే ఆ బావిలోని నీరు కుతకుతా ఉడుకుతుండటం మరో విచిత్రం. ఈ ఘటన బీహార్‌లోని(Bihar) భాగల్‌పూర్‌లో(Bhagalpur) జరిగింది. ఇప్పుడీ బావిని చూడటానికి దూర ప్రాంతాల నుంచి కూడా జనం విపరీతంగా వస్తున్నారు. కొంతమంది ఈ బావిని చూసి భయపడుతున్నారు.భాగల్‌పూర్ జిల్లాలోని గోరాడీప్ పరిధిలోని హర్చండీ గ్రామంలోని బదరీ బహరియాలో ఉన్న ఈ బావిలోంచి ఉబికి వస్తున్న నీరు వేడికి ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది కానీ ముట్టుకుని చూస్తే మాత్రం నీరు చల్లగానే ఉండటం విశేషం.
రెండు దశాబ్దాలుగా ఆ బావి పూర్తిగా ఎండిపోయి ఉంది. అయితే ఉన్నట్టుండి ఆ బావిలో నీరు ఉబికిబికి వస్తోంది. ఇదే వింత అనుకుంటే ఆ బావిలోని నీరు కుతకుతా ఉడుకుతుండటం మరో విచిత్రం. ఈ ఘటన బీహార్‌లోని(Bihar) భాగల్‌పూర్‌లో(Bhagalpur) జరిగింది. ఇప్పుడీ బావిని చూడటానికి దూర ప్రాంతాల నుంచి కూడా జనం విపరీతంగా వస్తున్నారు. కొంతమంది ఈ బావిని చూసి భయపడుతున్నారు.భాగల్‌పూర్ జిల్లాలోని గోరాడీప్ పరిధిలోని హర్చండీ గ్రామంలోని బదరీ బహరియాలో ఉన్న ఈ బావిలోంచి ఉబికి వస్తున్న నీరు వేడికి ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది కానీ ముట్టుకుని చూస్తే మాత్రం నీరు చల్లగానే ఉండటం విశేషం. 70 ఏళ్ల కిందట నిర్మితమైన ఈ బావి గత కొన్నేళ్లుగా పూర్తిగా ఎండిపోయింది. ఇటీవలే గ్రామానికి చెందిన ఓ యువకుడు మెట్ల ద్వారా బావిలోనికి వెళ్లి చూశాడు.నీరు ఒక మట్టం వరకే వచ్చి ఆగిపోయింది. గ్రామంలోనే ఉన్న ఓ ప్రొఫెసర్ ఈ నీటిని డీటీఎస్ పరీక్షలకు పంపారు. ఫలితాల్లో తేలిందేమిటంటే ఈ నీరు తాగేందుకు ఏ మాత్రం పనికి రాదు. జనం మాత్రం బావి నీటితో స్నానం చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ బావి నీళ్లతో స్నానం చేసిన సునైనా దేవి అనే స్థానికురాలికి చర్మ సంబంధిత రోగాలన్నీ మాయమయ్యాయట! ఆమె చెబుతున్న ఈ మాటల్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ గ్రామానికి చెందిన చాలా మంది ఈ బావిలోని నీటితో స్నానం చేస్తున్నారు.