ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నోని(Lucknow) ఇందిరానగర్‌లో చిత్రమైన ఘటన చోటు చేసుకుంది. దొంగతనానికి(Theft) వచ్చిన ఓ వ్యక్తి చోరీని పక్కన పెట్టేసి నిద్రపోయాడు. ఇందిరానగర్‌కు చెందిన డాక్టర్‌సునీల్ పాండే వారణాసిలోని బల్‌రాంపూర్ హాస్పిటల్‌లో పని చేస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాజధాని లక్నోని(Lucknow) ఇందిరానగర్‌లో చిత్రమైన ఘటన చోటు చేసుకుంది. దొంగతనానికి(Theft) వచ్చిన ఓ వ్యక్తి చోరీని పక్కన పెట్టేసి నిద్రపోయాడు. ఇందిరానగర్‌కు చెందిన డాక్టర్‌సునీల్ పాండే వారణాసిలోని బల్‌రాంపూర్ హాస్పిటల్‌లో పని చేస్తున్నాడు. దాంతో ఇక్కడి నుంచి వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇందిరానగర్‌లోని ఇంట్లో ఎవరూ ఉండకపోవడాన్ని గమనించిన ఓ దొంగ రాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డాడు. అల్మారా పగులగొట్టి నగలు, నగదు మూటకట్టుకున్నాడు. అవి తీసుకుని ఉడాయించకుండా వాష్‌బేసిన్, గ్యాస్ సిలిండర్, వాటర్‌పైపులను కూడా ఎత్తుకెళదామనుకున్నాడు. ఈ క్రమంలో హౌస్ బ్యాటరీని తొలగిస్తుండగా మత్తుగా అనిపించి అక్కడే పడుకుండిపోయాడు. తెల్లారి డాక్టర్ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసిన స్థానికులకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూశారు. వస్తువులన్నీ మూటగట్టి ఉండటాన్ని గమనించారు. పక్కనే దొంగ నిద్రిస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి దొంగను నిద్రలేపారు. కళ్లు తెరిచేసరికి చుట్టూ పోలీసులు ఉండటంతో షాక్ అయ్యాడు. పోలీసులు అరదండాలు వేసి పట్టుకెళ్లారు.