ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) మరోసారి కుల(Cast) అహంకారం బయటపడింది. అగ్రవర్ణాల దాష్టికానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఉన్నావ్‌(Unnao) జిల్లాలో ఈ దారుణం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) మరోసారి కుల(Cast) అహంకారం బయటపడింది. అగ్రవర్ణాల దాష్టికానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఉన్నావ్‌(Unnao) జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఇద్దరు ప్రేమికులను చంపేసి, ఆ మృతదేహాలను చెట్టుకు వేలాడదీసి, వారు ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు.. వారు ఇంత ఘాతుకానికి పాల్పడటానికి కారణం

అగ్రకులానికి చెందిన ఆ 17 ఏళ్ల బాలిక, దళితుడైన 19 ఏళ్ల యువకుడిని ప్రేమించడమే! ఈ ప్రేమ వ్యవహారం నచ్చని బాలిక కుటుంబ సభ్యులు యువకుడిని కిడ్నాప్‌ చేసి ఓ మామిడి తోటలో చంపేశారు. తర్వాత బాలికను కూడా అక్కడికి తీసుకొచ్చి చంపేశారు. ఇద్దరి మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. పోలీసులు బాలిక తండ్రితో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated On 11 May 2023 11:29 PM GMT
Ehatv

Ehatv

Next Story