ఢిల్లీలోని(Delhi) ప్రీత్ విహార్‌లో 15 ఏళ్ల బాలుడు ఓ వ్యక్తిని దారుణంగా పొడిచి చంపాడు(Murder).

తమిళ స్టార్‌ హీరో దళపత విజయ్‌కు(Vijay thalapathy) సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) అంత క్రేజ్‌ ఉంది. ఆ మాటకొస్తే తమ హీరోనే సూపర్‌స్టార్‌ అని విజయ్‌ అభిమానులు చెబుతూ ఉంటారు. రజనీ తర్వాత మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటుడు ఈయనే! విజయ్‌ సినిమా వస్తున్నదంటే చాలు ఫ్యాన్స్‌కు పెద్ద పండుగ. థియేటర్‌లలో నానా హంగామా ఉంటుంది. విజయ్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్ టైమ్‌.. షార్ట్‌గా గోట్ (GOAT) అని అంటున్నారు. ఈ సినిమాకు వెంకట్‌ ప్రభు(Venkat prabhhu) దర్శకత్వం వహించాడు. ప్రశాంత్‌, వైభ‌వ్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. విజయ్‌ సినిమా విడుదల రోజు చాలా కంపెనీలు(Companies) తమ ఉద్యోగులకు సెలవు(Holiday) ప్రకటించాయి. తాజాగా పార్క్విక్‌ అనే కంపెనీ కూడా విజయ్‌ సినిమా చూసేయమని ఉద్యోగులకు సెలవిచ్చేసింది.

'సెప్టెంబర్ 05, 2024న దళపతి విజయ్ సినిమా ది గోట్ విడుద‌ల అవుతున్నది. ఈ సందర్భంగా.. మా కంపెనీ ఉద్యోగులకు ప్ర‌త్యేక సెలవు దినాన్ని ప్ర‌క‌టిస్తున్నాం. విజ‌య్ స‌ర్‌పై ఉన్న అభిమానానికి చిహ్నంగా, అలాగే మా ఉద్యోగులలో ఉన్న అపారమైన ఉత్సాహానికి గుర్తుగా, యాజమాన్యం ఈ ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. సినిమా హిట్ కావాలని ది గోట్ చిత్ర బృందానికి మా విషెస్ తెలుపుతున్నాం. అలాగే ఈ సినిమాకు సంబంధించి మా ఉద్యోగులకు కాంప్లిమెంటరీ టిక్కెట్‌లను కూడా అందించ‌బోతున్నాం' అంటూ పార్క్విక్(Parkqwik) సీఈఓ అరుణ్ కుమార్(Arun Kumar) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

Eha Tv

Eha Tv

Next Story