బెంగళూరులో(Bangalore) విజయనగరం దాసరహళ్లి సర్కిల్‌లో ఓ జంట 4 లక్షల విలువైన బంగారు గొలుసుతో(Gold Chain) కూడిన గణేష్ విగ్రహాన్ని మొబైల్ ట్యాంక్‌లో పొరపాటున నిమజ్జనం చేశారు

బెంగళూరులో(Bangalore) విజయనగరం దాసరహళ్లి సర్కిల్‌లో ఓ జంట 4 లక్షల విలువైన బంగారు గొలుసుతో(Gold Chain) కూడిన గణేష్ విగ్రహాన్ని మొబైల్ ట్యాంక్‌లో పొరపాటున నిమజ్జనం చేశారు. 10 గంటల పాటు 10,000 లీటర్ల నీటిని పంపింగ్ చేశారు. కానీ అప్పటికే అందుఓ 300 విగ్రహాలు నిమజ్జనం చేశారు. రామయ్య, ఉమాదేవి అనే దంపతులు విగ్రహానికి బంగారు గొలుసు, పూలు, ఇతర వస్తువలతో అలంకరించారు. అయితే విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో బంగారు గొలుసును తీయడం మర్చిపోయారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత దంపతులు ఇంటికి చేరుకున్నారు.. ఆ తర్వాత గొలుసు తీయడం మరిచిపోయామని గ్రహించారు. వెంటనే మొబైల్ ట్యాంక్ వద్దకు వెళ్లి పోయిన వస్తువు గురించి ఆరా తీశారు. ఈ ఘటనపై పోలీసులకు, ఎమ్మెల్యే ప్రియాకృష్ణకు దంపతులు సమాచారం అందించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో బంగారు గొలుసును వెతికేందుకు 10 గంటల పాటు శ్రమించారు. మొబైల్‌ ట్యాంక్‌లో 10 వేల లీటర్ల నీరు ఉంది. అందులో అప్పటికే 300 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. విగ్రహాలు కరిగిపోవడంతో మట్టి, ఇతర వస్తువులు ఉండడంతో గోల్డ్ చైన్‌ను కనుగొనేందుకు 10 గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు గొలుసు లభ్యం కావడంతో దంపతులు ఊపిరి పీల్చుకున్నారు.

Eha Tv

Eha Tv

Next Story