కర్ణాటక (Karnataka Elections )ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మహా అయితే మరో పన్నెండు రోజులు మాత్రమే ఉంది.. అధికార, విపక్షాలు ఓట్ల వేటలో అవిశ్రాంతంగా తిరుగుతున్నాయి. హామీలు గుప్పిస్తున్నాయి. ఓటరు మాత్రం రిజర్వేషన్లు, అభివృద్ధి వంటివాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఓ సర్వేలో తేలింది. అవినీతినే ఓటరు ప్రధాన సమస్యగా భావిస్తున్నాడట. అందుకు కారణం ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ (bjp)ప్రభుత్వమేనంటున్నారు.
కర్ణాటక (Karnataka Elections )ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మహా అయితే మరో పన్నెండు రోజులు మాత్రమే ఉంది.. అధికార, విపక్షాలు ఓట్ల వేటలో అవిశ్రాంతంగా తిరుగుతున్నాయి. హామీలు గుప్పిస్తున్నాయి. ఓటరు మాత్రం రిజర్వేషన్లు, అభివృద్ధి వంటివాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఓ సర్వేలో తేలింది. అవినీతినే ఓటరు ప్రధాన సమస్యగా భావిస్తున్నాడట. అందుకు కారణం ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ (bjp)ప్రభుత్వమేనంటున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలు అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. కొందరు నేతలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ముఖ్యమంత్రి బొమ్మైతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులపైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బొమ్మై పాలనలో 40 శాతం కమిషన్ ఇవ్వనిదే ఏ ఫైలూ కూడా ముందుకు కదలడం లేదని కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేతలు గగ్గోలు పడుతున్నారట. అవినీతి పెచ్చరిల్లినందుకే ఓటరు దాన్నే పెద్ద సమస్యగా భావిస్తున్నాడు. ఈ విషయం ఓ సర్వేలో తేలడంతో అధికార బీజేపీలో ఆందోళన కనిపిస్తోంది. అవినీతి ప్రాతిపదికనే తాము ఓటు వేస్తామని చాలా మంది ఓటర్లు చెప్పారు. ఇటీవల ఎడీనా అనే సంస్థ సర్వే జరిపింది. ఇందులో అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని 68 శాతం మంది ఓటర్లు తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఇదే విషయాన్ని వెల్లడించారు. 77 శాతం కాంగ్రెస్ మద్దతుదారులు, 66 శాతం జనతాదళ్, 61 శాతం బీజేపీ మద్దతుదారులు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 183 అసెంబ్లీ నియోజకవర్గాలో సర్వేను నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గంలో 16 బూత్‌లను ఎంపిక చేసుకుని ఓటర్ల అభిప్రాయాలను సేకరించారు. ఇప్పటి వరకు 40 వేల మందిని సర్వే చేశారు. ఇంకా 28 నియోజకవర్గాలలో సర్వే చేయాల్సి ఉంది. అవినీతి అంశం తర్వాత ధరల పెరుగుదలపైనే ఓటరు ఎక్కువ దృష్టి పెట్టాడు. ఇక నిరుద్యోగం, మహిళల భద్రత, తాగునీరు, విద్యుచ్ఛక్తి, ఆరోగ్యం, విద్య, నేరాలు, హింస, దౌర్జన్యాలు వంటివి కూడా ఓటరు పరిగణనలోకి తీసుకున్నాడు.