జార్ఖండ్‌లో(Jharkhand) దారుణం జరిగింది. భర్తతో కలిసి జార్ఖండ్ పర్యటనకు వచ్చిన స్పెయిన్(Spain) దేశానికి చెందిన యువతిపై సామూహిక అత్యాచారానికి(Gang rape) పాల్పడ్డారు పది మంది దుండగులు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
జార్ఖండ్‌లో(Jharkhand) దారుణం జరిగింది. భర్తతో కలిసి జార్ఖండ్ పర్యటనకు వచ్చిన స్పెయిన్(Spain) దేశానికి చెందిన యువతిపై సామూహిక అత్యాచారానికి(Gang rape) పాల్పడ్డారు పది మంది దుండగులు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది జార్ఖండ్ ప్రభుత్వం. స్పెయిన్‌కు చెందిన దంపతులు ఆసియాలో పర్యటిస్తున్నారు. మొదట పాకిస్తాన్‌ను సందర్శించిన భార్యాభర్తలు తర్వాత బంగ్లాదేశ్‌కు వెళ్లారు. బంగ్లాదేశ్ మీదుగా జార్ఖండ్‌లోని దుమ్కాకు వచ్చారు. దుమ్కాలో బైక్‌పై పర్యటిస్తూ పలు ప్రదేశాలను కవర్ చేస్తున్నారు. కుంజి గ్రామంలో టెంట్లు వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దుండగులు స్పానిష్ యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అడ్డుకున్న భర్తపైనా దాడి చేశారు. అత్యాచారానికి గురైన యువతిని హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. కుంజీ గ్రామానికి చెందిన యువకులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.