కర్ణాటకలో(Karntaka) ఓట్ల లెక్కింపు(Counting) జరుగుతోంది. ట్రెండ్స్‌లో బీజేపీ(BJP) వెనుకంజలో ఉండగా, కాంగ్రెస్(Congress) ముందంజలో ఉంది. ఇదిలావుంటే.. షిగ్గావ్‌లోని బీజేపీ క్యాంపు కార్యాలయ(BJP Camp office) ఆవరణలోకి పాము(Snake) ప్రవేశించింది.

Karnataka Elections
కర్ణాటకలో(Karntaka) ఓట్ల లెక్కింపు(Counting) జరుగుతోంది. ట్రెండ్స్‌లో బీజేపీ(BJP) వెనుకంజలో ఉండగా, కాంగ్రెస్(Congress) ముందంజలో ఉంది. ఇదిలావుంటే.. షిగ్గావ్‌లోని బీజేపీ క్యాంపు కార్యాలయ(BJP Camp office) ఆవరణలోకి పాము(Snake) ప్రవేశించింది. దీంతో కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు. అలర్టైన భద్రతా సిబ్బంది పామును పట్టుకుని బయటకు విసిరేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి బసవరాజ్(Basavaraj) బొమ్మై కూడా ఈ కార్యాలయ ప్రాంగణంలో ఉండటం విశేషం.
ఇదిలావుంటే.. ట్రెండ్స్‌లో కాంగ్రెస్(Congress) భారీ ఆధిక్యంతో మెజారిటీ మార్కును దాటేసింది. కాంగ్రెస్ 117 స్థానాల్లో, బీజేపీ 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. కౌంటింగ్‌లో బీజేపీ ప్రభుత్వంలోని పలువురు కేబినెట్ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. బెంగళూరులో కూడా బీజేపీ వెనుకబడింది. మరో పార్టీ జేడీఎస్(JDS) 28 స్థానాల్లో ముందంజలో ఉంది.
#WATCH A snake which had entered BJP camp office premises in Shiggaon, rescued; building premises secured amid CM's presence pic.twitter.com/1OgyLLs2wt
— ANI (@ANI) May 13, 2023
