రాష్ట్రంలోని 75 సరిహద్దు గ్రామాలకు పేర్లు పెట్టాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను ఈ గ్రామాలకు పెట్టాలని నిర్ణయించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో(In Azadi Ka Amrit Mahotsav) భాగంగా పేరు మార్చే ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు.

రాష్ట్రంలోని 75 సరిహద్దు గ్రామాలకు(Border villages) పేర్లు పెట్టాలని త్రిపుర ప్రభుత్వం(Tripura government )నిర్ణయించింది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుల(Freedom fighters) పేర్లను ఈ గ్రామాలకు(Villages) పెట్టాలని నిర్ణయించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో(Azadi Ka Amrit Mahotsav) భాగంగా పేరు మార్చే ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. దేశ స్వాతంత్య్రంలో స్వాతంత్య్ర సమరయోధుల కృషిని గుర్తుచేసుకునే అమృత్ మహోత్సవ్‌ కార్యక్రమం జూలైలో ప్రారంభమై ఆగస్టు 15 వరకు కొనసాగనుంది.

ఎనిమిది జిల్లాల్లోని 75 గ్రామాల పేర్లను మార్చనున్నట్లు సమాచార, సాంస్కృతిక వ్యవహారాల కార్యదర్శి పీకే చక్రవర్తి(PK chakravarthi) తెలిపారు. జిల్లా స్థాయి కమిటీల ద్వారా ఈ గ్రామాలను గుర్తిస్తారు. రాష్ట్రంలోని స్వాతంత్య్ర సమరయోధుల జాబితాను, దేశ స్వాతంత్య్ర పోరాటానికి వారు చేసిన కృషిని ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ఎంపిక చేసిన గ్రామాల్లో 75 మంది స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలతో పాటు నామకరణం చేయడమే కాకుండా.. వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం సన్మానించనున్నట్లు తెలిపారు.

పీకే చక్రవర్తి మాట్లాడుతూ నామకరణం, మారథాన్, సైకిల్ ర్యాలీ, క్రాంతివీర్ సంగీత సమరోహ్, సిట్ అండ్ డ్రా, స్వాతంత్య్ర సమరయోధుల జీవితం, వారి కృషిపై పాటలు, నాటికలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని చిరస్మరణీయంగా మార్చేందుకు అనేక కార్యక్రమాలు ఉంటాయి. అంతే కాకుండా మొత్తం 75 గ్రామాలను రోడ్డు మార్గంలో అనుసంధానం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

Updated On 25 Jun 2023 4:27 AM GMT
Ehatv

Ehatv

Next Story