జైళ్లు మురికికూపాలుగా, నరకానికి నకళ్లుగా, పరమ దరిద్రంగా ఉంటాయనుకునేరు.. కాసింత పలుకుబడి, కాసిన్ని దుడ్లు ఉంటే చాలు.. జైలులో కూడా సర్వ సుఖాలు అనుభవించవచ్చు. సకల సౌకర్యాలను పొందవచ్చు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బరేలీ సెంట్రల్ జైలు(Bareli Central jail).. డిటైల్డ్‌గా చెప్పుకుంటే 2019, డిసెంబర్ 2వ తేదీన షాజహాన్‌పూర్‌ని సదర్ బజార్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) కాంట్రాక్టర్ రాకేశ్ యాదవ్‌ను(Rakesh Yadav) హత్య చేశారు.

Bareilly Central jail
జైళ్లు మురికికూపాలుగా, నరకానికి నకళ్లుగా, పరమ దరిద్రంగా ఉంటాయనుకునేరు.. కాసింత పలుకుబడి, కాసిన్ని దుడ్లు ఉంటే చాలు.. జైలులో కూడా సర్వ సుఖాలు అనుభవించవచ్చు. సకల సౌకర్యాలను పొందవచ్చు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బరేలీ సెంట్రల్ జైలు(Bareli Central jail).. డిటైల్డ్‌గా చెప్పుకుంటే 2019, డిసెంబర్ 2వ తేదీన షాజహాన్‌పూర్‌ని సదర్ బజార్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) కాంట్రాక్టర్ రాకేశ్ యాదవ్‌ను(Rakesh Yadav) హత్య చేశారు. తుపాకీతో కాల్చి చంపారు. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆసీఫ్, రాహుల్ చౌదరి ప్రస్తుతం బరేలీ సెంట్రల్ జైలులో కారాగారశిక్ష అనుభవిస్తున్నారు. జైలులో ఉన్న ఆసిఫ్ ఇటీవల సోషల్ మీడియా(Social media) ద్వారా లైవ్‌లో మాట్లాడారు. తాను స్వర్గంలో ఉన్నానని, జైలులోని సౌకర్యాలతో ఆనందిస్తున్నానని తెలిపాడు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. దీంతో హతుడి తమ్ముడు జిల్లా కలెక్టర్ ఉమశ్ ప్రతాప్ సింగ్‌ను కలుసుకుని కంప్లయింట్ ఇచ్చాడు. జైలులో ఉన్న నిందితులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసలు ఖైదీలకు సెల్ ఫోన్‌లు ఇవ్వడమే పెద్ద తప్పు అంటే, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం ఇంకా పెద్ద తప్పు. వీటికంటే నిందితులకు సకల సౌకర్యాలు కల్పించడం మరో పెద్ద తప్పు. డీఐజీ కిషోర్ దీనిపై రియాక్టరయ్యారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
