ఆచారాల ప్రకారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంతో దానిపై రాజకీయం కూడా మొదలైంది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రారంభోత్సవ వేడుకను బహిష్కరించిన వేళ.. ఆర్జేడీ చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది.
ఆచారాల ప్రకారం కొత్త పార్లమెంట్(New Parliament) భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఈరోజు ప్రారంభించారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంతో దానిపై రాజకీయం కూడా మొదలైంది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రారంభోత్సవ వేడుకను బహిష్కరించిన వేళ.. ఆర్జేడీ(RJD) చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది. పార్లమెంట్ ప్రారంభోత్సవం అనంతరం లాలూ(Lalu Prasad Yadav) పార్టీ ఆర్జేడీ.. కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసింది. కొత్త పార్లమెంట్ నిర్మాణం శవపేటిక(Coffin) లాంటిదని, త్వరలోనే దేశ ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని శవపేటికలో పెడతారని ఆర్జేడీ పేర్కొంది.
ఆర్జేడీ కొన్నిసార్లు సెక్యులర్(Secular) పార్టీ అని.. కొన్నిసార్లు బీజేపీ నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్(Nitish Kumar)ను ముఖ్యమంత్రిని చేస్తుందని ఒవైసీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) ప్రారంభించి ఉంటే బాగుండేదని ఒవైసీ అన్నారు.
ఆర్జేడీ ప్రకటనపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) మండిపడ్డారు. ఆర్జేడీకి ఎలాంటి స్టాండ్ లేదని, పార్లమెంటును శవపేటికతో పోల్చి పెద్ద తప్పు చేసిందన్నారు. ఆయన ఇంకేదో మాట్లాడి ఉండొచ్చు.. ఈ యాంగిల్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది.? పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్(Delhi Fire Service) నుంచి క్లియరెన్స్(Clearence) కూడా లేదని.. అందుకే కొత్త భవనం అవసరమని ఒవైసీ అన్నారు.
కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్(Congress) తీవ్రమైన మాటల దాడిని ప్రారంభించింది. "పార్లమెంటరీ విధానాలను పూర్తిగా విస్మరించి స్వీయ-అభిమానం కలిగిన నిరంకుశ ప్రధాని" కొత్త కాంప్లెక్స్‌ను ప్రారంభించారని పేర్కొంది.