బీహార్‌లోని(Bihar) ఓ ఆసుపత్రిలో(Hospital) ఆదివారం నవజాత శిశువును(New Born baby) అపహరించారు.
బీహార్‌లోని(Bihar) ఓ ఆసుపత్రిలో(Hospital) ఆదివారం నవజాత శిశువును(New Born baby) అపహరించారు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.
బేగుర్‌సరాయ్‌లోని సదర్ హాస్పిటల్‌లోని ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్‌లోకి ప్రవేశించిన ఒక మహిళ, మగబిడ్డను గుడ్డలో చుట్టి, ప్రాంగణం నుండి బయటకు వెళ్లినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. లోహియా నగర్‌కు చెందిన నందిని దేవి రాత్రి 10:30 గంటలకు బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కుటుంబసభ్యులు చిన్నారికి పాలు పట్టేందుకు ఆస్పత్రికి చేరుకోగా, పాప కనిపించలేదు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన కొడుకును చివరిసారిగా చూసిన తండ్రి, నర్సు శిశువును తనకు అప్పగించడం లేదని అతని భార్య అతనికి తెలియజేయడంతో ఆసుపత్రికి చేరుకున్నాడు. శిశువు ఎలా తప్పిపోయిందన్న విషయంపై ఆస్పత్రి సిబ్బంది క్లారిటీ ఇవ్వలేదు. ఆసుపత్రిలో భద్రతా లోపం కనిపించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డను వెంటనే తిరిగి ఇవ్వాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పాప కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతోందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.