బెంగళూరులోని (Bangalore) వైట్‌ఫీల్డ్‌లో మొబైల్ ఫోన్ పేలిపోయింది. ప్రసాద (Prasad) అనే 25 ఏళ్ల యువకుడు తన సెల్‌ఫోన్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుని బైక్‌పై వెళ్తుండగా సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలింది. వన్ ప్లస్ (One Plus) కంపెనీకి చెందిన సెల్‌ఫోన్ పేలడంతో ప్రసాద్ తొడపై తీవ్ర గాయమైంది
mobile phone exploded in Whitefield, Bangalore.
ప్రసాద్ (Prasad) అనే యువకుడు తన సెల్‌ఫోన్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుని బైక్‌పై వెళ్తుండగా సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలింది. వన్ ప్లస్ (one Plus) కంపెనీకి చెందిన సెల్‌ఫోన్ పేలడంతో ప్రసాద్ తొడపై తీవ్ర గాయమైంది. ప్రసాద్ హుటాహుటిన ఆస్పత్రికి (Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స కోసం రూ.4 లక్షలు అవుతుందని వైద్యులు చెప్పడంతో ప్రసాద్ వన్‌ప్లస్ కంపెనీని సంప్రదించాడు. వైద్య ఖర్చులతో పాటు సెల్‌ఫోన్ ఖర్చును భరిస్తామని షోరూం నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ నెలలో, అతను వన్ ప్లస్ (1+) కంపెనీ షోరూం మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేట్ మొబైల్ షోరూమ్ నుంచి ఈ మొబైల్‌ను కొనుగోలు చేశాడు. గాయాలతో తాను ఉపాధి కోల్పుతున్నానని, అందుకు పరిహారం చెల్లించాలని ఆ యువకుడు కోరుతున్నాడు. అవసరమైతే కోర్టుకు వెళ్తానని బాధితుడు చెప్తున్నాడు.