ఓ మహిళకు పెళ్లయింది. ఆ తర్వాత భర్తతో విడాకులు(Divorce) తీసుకుంది. ఓ యువకుడితో పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆ యువకుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళ్తే చెన్నై(chennai) పులియంతోపులోని కస్తూరి బాయ్‌కాలనీకి చెందిన వేలుస్వామికి ముగ్గురు కూతుర్లు. రెండో కూతురు దీప(Deepa) (33)ను 2014లో ఓ వ్యక్తికి ఇచ్చి ఘనంగా పెళ్లి జరపించారు.

ఓ మహిళకు పెళ్లయింది. ఆ తర్వాత భర్తతో విడాకులు(Divorce) తీసుకుంది. ఓ యువకుడితో పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆ యువకుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళ్తే చెన్నై(chennai) పులియంతోపులోని కస్తూరి బాయ్‌కాలనీకి చెందిన వేలుస్వామికి ముగ్గురు కూతుర్లు. రెండో కూతురు దీప(Deepa) (33)ను 2014లో ఓ వ్యక్తికి ఇచ్చి ఘనంగా పెళ్లి జరపించారు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పెళ్లయిన రెండేళ్ల తర్వాత భర్తతో విడాకులు తీసుకుంది.ఆ తర్వాత తల్లిదండ్రుల కలిసి ఉంటోంది. ఆ తర్వాత దీప చెన్నైలోని సెల్‌ఫోన్‌ దుకాణంలో పనిచేస్తోంది. 2022లో వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఆలత్తూరు గ్రామానికి చెందిన హేమంత్‌రాజ్‌(26)తో పరిచయం ఏర్పడింది. తర్వాత వారిద్దరూ సెల్‌ఫోన్‌లో తరచూ మాట్లాడుకునే వారు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. దీంతో దీప తనను వివాహం చేసుకోవాలని హేమంత్‌రాజ్‌పై ఒత్తిడి చేస్తోంది.

అయితే దీప తన కంటే 8 ఏళ్లు పెద్దదని తెలియడంతో పెళ్లికి హేమంత్‌రాజు నిరాకరిస్తూ వచ్చాడు. అయినా వీరి ప్రేమవ్యవహారం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఈనెల 14న దీపను గుడియాత్తం రావాలని దీపకు చెప్పాడు. హేమంత్‌రాజు మాటలు విని దీప చెన్నై నుంచి గుడియాత్తం పట్టణానికి రైలులో వచ్చింది. దీపను గుడియాత్తం శివారు ప్రాంతంలో ఉన్న ఓ కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ ఉల్లాసంగా గడిపారు. ఇదే మంచి సమయం అనుకొని తనను పెళ్లి చేసుకోవాలని హేమంత్‌ను మరోసారి కోరింది దీప. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదానికి దిగారు. ఆవేశం పట్టలేక హేమంత్‌రాజ్‌ ముందే తెచ్చుకున్న కత్తితో దీప గొంతు కోసి చంపాడు. మృతదేహాన్ని కొండపై నుంచి కిందకు తోసి, కత్తిని అక్కడే పడేశాడు. అమాయకుడిలా ఇంటికి తిరిగొచ్చాడు. బయటకు వెళ్లిన దీప తిరిగిరకపోవడంతో చెన్నైలోని పులియంతోపు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీప తల్లిదండ్రులు. దీప సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. హేమంత్‌రాజ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆధారాలు సేకరించి.. అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో దీపను కొండపైకి తీసుకెళ్లి హతమార్చినట్లు అంగీకరించాడు. వెంటనే కొండ ప్రాంతానికి వెళ్లిన చూడగా దీప మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. మృదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రేమ పేరుతో కిరాతకుడిని నమ్మి తమ కూతురు హత్యగావించబడిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Updated On 27 April 2024 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story