హంతకుల్లో కొందరికి పాపభీతి ఉంటుందేమో! చేసిన తప్పుకు లోలోపల కుమిలిపోతుంటారేమో! వీటి సంగతేమిటో తెలియదు కానీ, హతుడి ఆత్మ పగపట్టి ప్రతీకారం తీర్చుకోవడమన్నది కథల్లో చదివాం, సినిమాల్లో చూశాం. కానీ చంపేసిన వ్యక్తి కలలోకి వచ్చి చిత్రహింసలు పెట్టడమన్నది ఇప్పుడే వింటున్నాం. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో జరిగింది. 20 ఏళ్ల కిందట చంపేసిన వ్యక్తి హంతకుడి కలలోకి వచ్చి తెగ హింసిస్తున్నాడట! పోలీసులకు ఈ విషయం చెబితే అతడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.
హంతకుల్లో కొందరికి పాపభీతి ఉంటుందేమో! చేసిన తప్పుకు లోలోపల కుమిలిపోతుంటారేమో! వీటి సంగతేమిటో తెలియదు కానీ, హతుడి ఆత్మ పగపట్టి ప్రతీకారం తీర్చుకోవడమన్నది కథల్లో చదివాం, సినిమాల్లో చూశాం. కానీ చంపేసిన వ్యక్తి కలలోకి వచ్చి చిత్రహింసలు పెట్టడమన్నది ఇప్పుడే వింటున్నాం. ఈ ఘటన చత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బాలోద్ జిల్లా(Balod District)లో జరిగింది. 20 ఏళ్ల కిందట చంపేసిన వ్యక్తి హంతకుడి కలలోకి వచ్చి తెగ హింసిస్తున్నాడట! పోలీసులకు ఈ విషయం చెబితే అతడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.
అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఓ 20 ఏళ్ల వెనక్కి వెళ్లాలి. బాలోద్‌లోని కరక్‌భాట్ ప్రాంతానికి చెందిన టికం కొలియారా అనే వ్యక్తి 2003లో 17 ఏళ్ల ఛవేశ్వర్ గోయల్ అనే వ్యక్తిని చంపేసి, మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టాడు. ఈ విషయాన్ని గత సంవత్సరం గ్రామస్థులకు చెప్పాడు. చంపడానికి కారణమేమిటో కూడా వివరించారు. హతుడు కొరియారా భార్యకు స్నేహితుడట! ఆమెతో అతడు అసభ్యంగా ప్రవర్తించడం చూసి తట్టుకోలేక చంపేశాడట. అయితే చనిపోయిన ఛవేశ్వర్ గోయల్ ఇప్పుడు తన కలలోకి వచ్చి వేధిస్తున్నాడని కొలియారా గ్రామస్థులతో మొరపెట్టుకున్నాడు. ఎలాగైనా కాపాడాలంటూ వేడుకున్నాడు. గ్రామస్తులు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొలియారా చెప్పిన వివరాల ఆధారంగా 2021లో తవ్వకాలు జరిపారు. కానీ మృతదేహం దొరికితేగా! అసలు శవాన్ని పాతిపెట్టిన ఆనవాళ్లు కూడా పోలీసులకు లభించలేదు. మతి భ్రమించి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడేమోనన్న అనుమానం పోలీసులకు కలిగింది. ఆ విషయమే చెప్పి కొలియారాను కుటుంబసభ్యులకు అప్పగించారు. కాకపోతే ఛవేశ్వర్ తండ్రి జగదీశ్ గోయల్‌కి మాత్రం కొలియారా మానసికస్థితి బాగానే ఉందనిపించింది. మరోసారి తవ్వకాలు జరపాలంటూ అధికారులను బతిమాలాడు. పోన్లే పాపం అనుకున్న అధికారులు ఈ నెల మూడో తేదీన మరోసారి తవ్వకాలు జరిపారు. ఓ డ్యామ్ పక్కన చేపట్టిన తవ్వకాల్లో కొన్ని ఎముకలు, జీర్ణస్థితిలో ఉన్న దుస్తులు దొరికాయి. ఎముకలను డీఎన్‌ఎ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. కొసమెరుపు ఏమిటంటే కొన్నాళ్లుగా కొలియారా కనిపించకుండా పోవడం...