ప్రభుత్వాలు ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి. మన దౌర్భగ్యమేమిటో కానీ ఈ రెండూ ఇప్పుడు కారొరేట్లకు కామధేనువుగా మారాయి. విద్య అమ్ముడు సరుకయ్యింది. వైద్యం ఖరీదయ్యింది. వైద్యం అందక, అందుకునే స్థోమత లేక ఎంతో మంది చనిపోతున్నారు. అంబులెన్స్‌కు(ambulance) కూడా డబ్బులు కట్టలేని అభాగ్యులు ఎంతో మంది.

ప్రభుత్వాలు ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి. మన దౌర్భగ్యమేమిటో కానీ ఈ రెండూ ఇప్పుడు కారొరేట్లకు కామధేనువుగా మారాయి. విద్య అమ్ముడు సరుకయ్యింది. వైద్యం ఖరీదయ్యింది. వైద్యం అందక, అందుకునే స్థోమత లేక ఎంతో మంది చనిపోతున్నారు. అంబులెన్స్‌కు(ambulance) కూడా డబ్బులు కట్టలేని అభాగ్యులు ఎంతో మంది. మొన్నటికి మొన్న బెంగాల్‌లో(Bengal) ఇలాంటి ఘటనే జరిగింది. అంబులెన్సుకు చెల్లించేందుకు డబ్బులు లేక ఆసిం దేవశర్మ అనే ఓ వ్యక్తి తన కొడుకు మృతదేహంతో(Dead body) రెండు వందల కిలోమీటర్లు(200 km) ప్రయాణించాడు.

విపక్షాలు ఎప్పటిలాగే ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. బెంగాల్‌లో ఆరోగ్య సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ఆసిం దేశశర్మది ఉత్తర్‌ దినాజ్‌పూర్ జిల్లా కలియగంజ్‌ ప్రాంతం డంగిపారా గ్రామం. అయిదు నెలల కిందట కవలలకు తండ్రియ్యారు. ఇటీవల కవలపిల్లలు అనారోగ్యం బారిన పడ్డారు. ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారుల ఆరోగ్యం విషమించడంతో వెంటనే రాయ్‌గంజ్‌ మెడికల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పారు.

కానీ పిల్లల తల్లిదండ్రులు మాత్రం సిలీగుడిలోని నార్త్‌ బెంగాల్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ చేర్పించినా పిల్లల ఆరోగ్యం మెరుగుపడలేదు. పైపెచ్చు మరింత క్షీణించింది. కవల పిల్లల్లో ఒకరిని తీసుకుని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయాడు. తన కొడుకు మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ ఇవ్వాల్సిందిగా నిర్వాహకులను వేడుకున్నాడు ఆసిం దేవశర్మ. ఎనిమిది వేల రూపాయలు ఇస్తే కానీ రానని చెప్పాడు డ్రైవర్‌. అంబులెన్స్‌ ఉన్నది పేషంట్ల కోసమేనని, శవాలను తీసుకెళ్లడానికి కాదంటూ ఓ కామెంట్‌ కూడా చేశాడా డ్రైవర్‌.

అప్పటికే పిల్లల చికిత్స కోసం చాలా ఖర్చు పెట్టాడు దేవశర్మ. ఆరు రోజుల చికిత్సకే 16 వేలు ఖర్చు అయ్యింది. చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయింది. గత్యంతరం లేక కొడుకు శవంతో సిలిగుడిలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కి రాయ్‌గంజ్‌లో దిగాడు. అక్కడి నుంచి కలియగంజ్‌కు వెళ్లడానికి మరో బస్సు ఎక్కాడు. అలా రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించాడా తండ్రి. చిన్నారి చనిపోయాడని తెలిస్తే బస్సులోంచి దింపేస్తారన్న భయంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. కలియగంజ్ చేరుకున్నాక పరిచయస్తుడొకరు అంబులెన్సును ఏర్పాటు చేశారు. అందులో ఇంటి వరకు వచ్చాడు. తనకు జరిగిన అనుభవాన్ని మీడియాకు చెప్పుకోవడంతో ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Updated On 15 May 2023 2:17 AM GMT
Ehatv

Ehatv

Next Story