ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఆగ్రాలో(agra) చిత్రం జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఆగ్రాలో(agra) చిత్రం జరిగింది. భూ వివాదంలో 24 ఏళ్ల ఓ యువకుడిని నలుగురు వ్యక్తులు సజీవంగా పూడ్చిపెట్టారు(Burried). కాసేపయ్యాక ఆ ప్రాంతాన్ని వీధి కుక్కలు(street dogs) తవ్వడంతో అతడు బతికి బయటపడ్డాడు. జులై 18వ తేదీన ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆగ్రాలోని అర్టోని ప్రాంతంలో అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాశ్ అనే వ్యక్తులు రూప్ కిశోర్ అలియాస్ హ్యాపీ అనే వ్యక్తిపై దాడికి దిగారు. అతడి గొంతు నులిమారు. చనిపోయాడని భావించి గొయ్యి తీసి పాతిపెట్టారు. అయితే అతడిని పూడ్చిపెట్టిన ప్రదేశంలో వీధి కుక్కల గుంపు తవ్వడమే కాకుడా అతడిని కొరికాయి. దాంతో అతడు స్పృహలోకి వచ్చాడు. కొంత మంది స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తన కొడుకును నలుగురు దుండగులు ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారని రూప్ కిశోర్ తల్లి ఆరోపిస్తున్నది. పోలీసులు ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.