అడుక్కుతినడం అనే పదాన్ని తిట్టుకో, వ్యంగానికో వాడుతుంటాం కదా! నిజానికి అడుక్కుతినడంలోనే గొప్ప ఉందంటున్నాడు బీహార్‌కు(Bihar) చెందిన ఓ యాచకుడు. అతడి పేరు పప్పు(Pappu). ఆ బిచ్చగాడు ఇలా అడుక్కున్న సొమ్ముతోనే శ్రీమంతుడయ్యాడు. రాజధాని పాట్నాలో(Patna) పలు చోట్ల అనేక భూములు కొన్నాడు. పేరొందిన ఓ ప్రైవేటు పాఠశాలలో తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. ఇతడికి సొంత ఇల్లు కూడా ఉంది.
అడుక్కుతినడం అనే పదాన్ని తిట్టుకో, వ్యంగానికో వాడుతుంటాం కదా! నిజానికి అడుక్కుతినడంలోనే గొప్ప ఉందంటున్నాడు బీహార్‌కు(Bihar) చెందిన ఓ యాచకుడు. అతడి పేరు పప్పు(Pappu). ఆ బిచ్చగాడు ఇలా అడుక్కున్న సొమ్ముతోనే శ్రీమంతుడయ్యాడు. రాజధాని పాట్నాలో(Patna) పలు చోట్ల అనేక భూములు కొన్నాడు. పేరొందిన ఓ ప్రైవేటు పాఠశాలలో తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. ఇతడికి సొంత ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లోనే ఉంటూ యాచక వృత్తిని(begging profession) సాగిస్తున్నాడు. అడుక్కుతినడం నేరమేమీ కాదంటున్నాడు పప్పు. చిన్నప్పుడు సరిగ్గా చదవడం లేదని తల్లిదండ్రులు బాగా కొట్టేవారట! దాంతో చిన్నప్పుడే పప్పు ముంబాయికి(Mumbai) పారిపోయాడట! రైల్వేస్టేషన్‌లో నిలుచున్న అతడిని చూసి బిచ్చగాడిగా భావించి జనం డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారట! కేవలం రెండు గంటల్లోనే పప్పు చేతికి 3, 400 రూపాయలు వచ్చాయట! ఆ క్షణమే పప్పు ఓ నిర్ణయానికి వచ్చేశాడు. పని చేయడం కంటే ఇదే బాగుందనుకుని మరుసటి రోజు కూడా అక్కడికే వెళ్లి కూర్చుకున్నాడట! మళ్లీ అతడి చేతికి వేల రూపాయలు వచ్చిపడ్డాయి. ఆ తర్వాత అది అలవాటుగా మారింది. వృత్తిగా మారింది. ముంబాయి నుంచి పాట్నాకు వచ్చి అక్కడ కూడా అడుక్కోవడం మొదలుపెట్టాడు పప్పు. తన ఇద్దరు పిల్లలు ఖరీదైన ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నారని, యాచించిన సొమ్ముతోనే పిల్లలను అధికారులుగా తీర్చిదిద్దుతానని పప్పు అంటున్నాడు.