కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(karnataka assembly elections) ఒకట్రెండు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మొత్తంమీద ప్రశాంతంగానే ముగిశాయి. పోలింగ్‌లో(polling) కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు కూడా జరిగాయి. మరికాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఓటేసిన నవ వధువు, పెళ్లి జరిగిన వెంటనే పోలింగ్‌కు బూత్‌కు వచ్చిన నూతన వధూవరులు..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(karnataka assembly elections) ఒకట్రెండు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మొత్తంమీద ప్రశాంతంగానే ముగిశాయి. పోలింగ్‌లో(polling) కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు కూడా జరిగాయి. మరికాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఓటేసిన నవ వధువు, పెళ్లి జరిగిన వెంటనే పోలింగ్‌కు బూత్‌కు వచ్చిన నూతన వధూవరులు..ఇలాంటివి చాలానే జరిగాయి. బళ్లారి(Ballari) జిల్లా కంప్లి నియోజకవర్గ పరిధిలోని కురగోడు తాలూకాలో ఇంకో విచిత్ర ఘటన జరిగింది. కొర్లగుంద(Korlagunda) గ్రామానికి చెందిన మణిలా(manila) అనే నిండు గర్భిణి(Pregnant) ఓటు వేయడానికి వచ్చింది. కాసేపు క్యూ లైన్‌లో నిలుచుంది కూడా! తర్వాత ఓటు వేసి నాలుగు అడుగులు వేసిందో లేదో నొప్పులు(Labour pains) మొదలయ్యాయి. పోలింగ్‌ సిబ్బందికి ఏం చేయాలో పాలుపోలేదు. కాసేపు పోలింగ్‌ను నిలిపివేశారు. గర్భిణికి సాయం చేయడానికి మహిళా సిబ్బంది ముందుకొచ్చింది. అది చూసి ఓటేయడానికి వచ్చి ఆ గదిలోనే ఉన్న మహిళలు కూడా తలో చేయి వేశారు. ఆమె కానుపుకు సాయం చేశారు. కాసేపటికి ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత తల్లిబిడ్డను స్థానిక ప్రభుత్వానికి తరలించారు. ఇదే సమయంలో కొన్ని విషాద సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బెళగావి జిల్లా యరగట్టి తాలూకా యరఝుర్వి గ్రామంలో ఓటు వేయడానికి వచ్చిన పారవ్వ ఈశ్వర సిద్ధాళ అనే 68 ఏళ్ల వృద్ధురాలు పోలింగ్‌ బూత్‌ ఆవరణలోనే కుప్పకూలి చనిపోయారు. హాసన్‌ జిల్లా బేలూరు తాలూకా చిక్కోలే గ్రామంలో 49 ఏళ్ల జయన్న ఓటు వేసి బయటకు వచ్చాడో లేదో గుండెపోటుతో కన్నుమూశారు.

Updated On 11 May 2023 2:29 AM GMT
Ehatv

Ehatv

Next Story