పాకిస్తాన్‌కు చెందిన సీమాహైదర్(Seema Haidher)- నోయిడాకు చెందిన సచిన్(Sachin) ప్రేమకథ పబ్జీ గేమ్ ద్వారా ప్రారంభమైన విషయం తెలిసిందే! ఆ ప్రేమ కోసం సీమా సాహసం చేసింది. అక్రమంగా సరిహద్దులు దాటి ఇండియాకు వచ్చింది. సరిగ్గా ఇలాంటి ప్రేమకథను మరోటి వెలుగులోకి వచ్చింది.
పాకిస్తాన్‌కు చెందిన సీమాహైదర్(Seema Haidher)- నోయిడాకు చెందిన సచిన్(Sachin) ప్రేమకథ పబ్జీ గేమ్ ద్వారా ప్రారంభమైన విషయం తెలిసిందే! ఆ ప్రేమ కోసం సీమా సాహసం చేసింది. అక్రమంగా సరిహద్దులు దాటి ఇండియాకు వచ్చింది. సరిగ్గా ఇలాంటి ప్రేమకథను మరోటి వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) గోరఖ్‌పూర్‌కు(Gorakhpur) చెందిన 21 ఏళ్ల యువతి ఫ్రీ ఫైర్(Free Fire) గేమ్ అడుతున్న సమయంలో బీహార్‌కు చెందిన సుజిత్(Sujeeth) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమ ముదిరింది. ఓ ఫైన్ డే వీరిద్దరు ఇళ్ల నుంచి మాయమయ్యారు. యువతి కుటుంబసభ్యులు ఆమెకోసం రెండు రోజుల పాటు అన్ని చోట్లా వెతికారు. తర్వాత ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని తెలుసుకున్నారు.
అది తెలిసిన తర్వాత పీపీగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిపై కిడ్నాప్ కేసు పెట్టి దర్యాప్తు మొదలు పెట్టారు. యువతి కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఆమె పాట్నాలో ఉంటున్న తన ప్రేమికుడు సుజీత్ దగ్గరకు వెళ్లిందని తేలింది. ఫ్రీ ఫైర్‌గేమ్ ద్వారా ప్రేమికులైన వారిద్దరూ జులై 31న ఇంటి నుంచి పరారయ్యారు. తమ కూతురు చదువుకుంటున్నానని చెబుతూ, తమకు తెలియకుండా మొబైల్‌లో గేమ్ అడుతుండేదని యువతి కుటుంబసభ్యులు అన్నారు. తాము కూతురుపై అంతగా దృష్టి పెట్టలేకపోయామని చెప్పారు. యువతి కోసం వెతుకులాట మొదలు పెట్టిన పోలీసులకు ప్రేమికుల లోకేషన్ బీహార్‌లోని పాట్నాను చూపించింది. సుజీత్ అనే వ్యక్తి పాట్నాలో ఆటో నడుపుతుంటాడని తెలిసింది. ప్రేమికులను గోరఖ్‌పూర్ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పీపీగంజ్ పోలీసు అధికారి ఆశీష్ సింగ్ తెలిపారు. ఈ కేసు వేరే రాష్ట్ర పరిధిలో ఉన్నందున అనుమతులు తీసుకోవలసి వస్తున్నదని చెప్పారు.