ఉదయ్‌పూర్(Udaipur ) నుంచి ఖజురహో(Khajuraho) వెళ్తున్న ఉదయ్‌పూర్-ఖజురహో ఎక్స్‌ప్రెస్‌లో(Khajuraho-Udaipur Express) మంటలు(Fire) చెలరేగిన ఘటన వెలుగు చూసింది. గ్వాలియర్‌లోని సిథోలి స్టేషన్ సమీపంలో రైలు ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు ఇన్నంటాయి. మంటలను గుర్తించిన వెంటనే లోకో పైలట్ సిథోలి సమీపంలో రైలును ఆపి కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు.

train engine catches Fire
ఉదయ్‌పూర్(Udaipur ) నుంచి ఖజురహో(Khajuraho) వెళ్తున్న ఉదయ్‌పూర్-ఖజురహో ఎక్స్‌ప్రెస్‌లో(Khajuraho-Udaipur Express) మంటలు(Fire) చెలరేగిన ఘటన వెలుగు చూసింది. గ్వాలియర్‌లోని సిథోలి స్టేషన్ సమీపంలో రైలు ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు ఇన్నంటాయి. మంటలను గుర్తించిన వెంటనే లోకో పైలట్ సిథోలి సమీపంలో రైలును ఆపి కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే గ్వాలియర్ నుండి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సమాచారం ప్రకారం.. ఉదయపూర్ ఖజురహో ఎక్స్‌ప్రెస్ గ్వాలియర్ స్టేషన్ నుంచి 12.45 గంటలకు ఝాన్సీకి బయలుదేరింది. గ్వాలియర్ స్టేషన్‌కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిథోలి స్టేషన్‌కు చేరుకోగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెంటనే లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. అనంతరం కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. రైలు ఆగిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయన్న విషయం తెలియడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీస్తూ రైలు నుంచి కిందకు దిగారు.
