ఓ రైతు పంటలు చేతికి అందక అప్పులపాలయ్యాడు. దీంతో తన అవయవాలను అమ్మకానికి పెట్టాడు.

ఓ రైతు పంటలు చేతికి అందక అప్పులపాలయ్యాడు. దీంతో తన అవయవాలను అమ్మకానికి పెట్టాడు. కిడ్నీ రూ.75,000, కాలేయం రూ.90,000, కళ్లు రూ.25,000కు అమ్ముతానంటూ మేడలో ప్లకార్డు వేసుకొని ప్రదర్శించాడు. ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని నెరవేర్చలేదని ఆరోపించాడు. మహారాష్ట్ర(maharashtra)లోని వాషిమ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అదోలి(Adholi) గ్రామానికి చెందిన సతీశ్‌(Sathish) ఐదోలు వ్యవసాయంలో పంటలు పెట్టి బాగా నష్టపోయాడు. దీంతో బ్యాంకు రుణాలు తీర్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపాడు. మా ‘రైతుల అవయవాలు కొనండి’ అని రాసి ఉన్న ఫ్లకార్డును మెడలో వేసుకున్నాడు. తన కిడ్నీలను రూ. 75 వేలకు, కాలేయాన్ని రూ. 90 వేలకు, కళ్లు రూ. 25 వేలకు అమ్ముతానని అందులో రాసుకున్నాడు. రైతుల దీన పరిస్థితిని చూసి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాడు.

ehatv

ehatv

Next Story