41 సెకన్ల నిడివి గల వీడియోను ఒక వార్తా ఛానెల్ క్లిప్ నుండి తీసుకున్నారు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద వచ్చిన ఫేక్ వీడియోను సృష్టించిన వారిపై కేసు నమోదు చేశారు. కృత్రిమ సాంకేతికత (AI)ని ఉపయోగించి, మధుమేహానికి సంబంధించిన ఔషధాన్ని ప్రమోట్ చేసేలా చూపించే నకిలీ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హజ్రత్‌గంజ్‌లోని సైబర్ పోలీస్ స్టేషన్‌లోని డిజిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ముస్లిం ఖాన్ ఫిర్యాదు మేరకు ఫేస్‌బుక్ ప్రొఫైల్ 'గ్రేస్ గార్సియా'పై IPC సెక్షన్లు 419, 420, 511.. IT చట్టం కింద కేసులు నమోదు చేశారు.

41 సెకన్ల నిడివి గల వీడియోను ఒక వార్తా ఛానెల్ క్లిప్ నుండి తీసుకున్నారు. ఫిబ్రవరి 26న FB ఖాతా ‘గ్రేస్ గార్సియా’ ద్వారా పోస్ట్ చేశారు. దీనికి ఫేస్‌బుక్‌లో 225K పైగా వ్యూస్.. 120 షేర్లు వచ్చాయి. ఈ వీడియోలో “భారత్ మే మధుమేహ్ పర్ విజయ్ ప్రాప్త్ కీ గయీ హై” అని కూడా ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించిన వీడియో అప్‌లోడ్ చేసిన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను కనుగొన్నట్లు ఫిర్యాదుదారు తన ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. AI టూల్స్ ను ఉపయోగించి వీడియోలో.. వెబ్‌సైట్ ద్వారా మధుమేహం మందుల కొనుగోలును ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి ఆడియో, వాయిస్ నేరేషన్ ను మార్చారు.

Updated On 10 March 2024 11:45 PM GMT
Yagnik

Yagnik

Next Story