చెన్నైకి(Chennai) చెందిన దంపతులు తమ ప్రసవాన్ని(Baby birth) సోషల్‌ మీడియాలో(Social media) ప్రకటించడంతో వివాదాస్పదమైంది.

చెన్నైకి(Chennai) చెందిన దంపతులు తమ ప్రసవాన్ని(Baby birth) సోషల్‌ మీడియాలో(Social media) ప్రకటించడంతో వివాదాస్పదమైంది. అంతేకాదు పోలీసుల విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య నిపుణుడిని సంప్రదించే బదులు తమ శిశువును ఇంట్లో డెలివరీ చేసుకునేందుకు 1,000 మందికి పైగా ఉన్న వాట్సాప్ గ్రూప్(Whatsapp) నుండి సూచనలను దంపతులు తీసుకున్నారని తెలిసింది. ఈ సంఘటన సోషల్ మీడియా (Socia media)వినియోగదారుల దృష్టిని మరింత ఆకర్షించింది. తల్లి, నవజాత శిశువుకు సరైన వైద్య సహాయం అందిస్తామని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు

మట్టి పని చేసే 36 ఏళ్ల మనోహరన్ , అతని 32 ఏళ్ల భార్య సుకన్య 'హోమ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్'(Home birth experience) అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. ఇంట్లో బిడ్డను ఎలా ప్రసవించాలో సభ్యులకు సలహా ఇచ్చే పోస్ట్‌లతో ఈ గ్రూప్‌ ఏర్పడింది. ఈ జంట తమ మూడో బిడ్డను ప్రసవించడంలో సహాయపడటానికి ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుకన్య మూడో బిడ్డతో గర్భవతి అయినప్పుడు ఆ జంట వైద్య పరీక్షలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. నవంబర్ 17న సుకన్యకు ప్రసవం వచ్చినప్పుడు కూడా ఆసుపత్రికి వెళ్లకుండా వాట్సాప్ గ్రూప్‌లో సూచనలు, సలహాలు తీసుకోవాలని దంపతులు నిర్ణయించుకున్నారు. డెలివరీని మనోహరన్ స్వయంగా నిర్వహించినట్లు సమాచారం. బిడ్డ పుట్టిన తర్వాత ఆ ప్రాంతానికి చెందిన పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ దంపతులపై కుండ్రత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మనోహరన్ వైద్య భద్రతా నిబంధనలను ఉల్లంఘించాడని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మనోహరన్‌ను విచారించిన పోలీసులు వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రసవించినట్లు తేలింది. ఎటువంటి వైద్య సహాయం లేకుండా ఇంట్లోనే తమ బిడ్డను ప్రసవించాలనే జంట నిర్ణయం వెనుక ఈ వాట్సాప్‌ గ్రూప్‌ కారణమని పోలీసులు పేర్కొన్నారు. స్థానిక ఆరోగ్య అధికారులు మనోహరన్‌తో మాట్లాడి ఆన్‌లైన్ సమాచారంపై ఆధారపడటం వల్ల కలిగే నష్టాలను వివరించారు. అతని భార్య మరియు నవజాత శిశువుకు సరైన వృత్తిపరమైన వైద్యం అవసరమని వారు తెలిపారు. తల్లీబిడ్డకు అవసరమైన వైద్య సహాయం అందుతుందని స్థానిక ఆరోగ్య అధికారి తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story