ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా మహేశ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో చిత్రమైన కేసు వచ్చింది. అక్షరాంపూర్‌ గ్రామానికి చెందిన నందలాల్‌ అనే వ్యక్తి బర్రె తప్పిపోయింది. పాపం చాలా చోట్ల వెతికి చూశాడు. ఎక్కడా కనిపించలేదు.

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా మహేశ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో చిత్రమైన కేసు వచ్చింది. A Buffalo Solved A Problem That A Village Panchayat in Uttar Pradesh పాపం చాలా చోట్ల వెతికి చూశాడు. ఎక్కడా కనిపించలేదు. ఆ బర్రె అటు తిరిగి ఇటు తిరిగి పక్క ఊరు హరికేశ్‌ అనే గ్రామానికి చేరింది. ఆ బర్రెన్‌ను ఆ ఊరికి చెందిన హనుమాన్‌ వ్యక్తి కట్టేసి పెట్టుకున్నాడు. హనుమన్‌ దగ్గర కట్టేసి ఉన్న బర్రె అచ్చం నీ బర్రెలాగే ఉందని ఎవరో చెబితే నందనాల్ అక్కడికి వెళ్లాడు. చూస్తే అది తన బర్రెనే! తన బర్రెను తనకు ఇచ్చయమని హనుమాన్‌ను అడిగాడు. హనుమాన్‌ మాత్రం అది తనదేనంటూ గట్టిగా వాదించాడు. ఇక లాభం లేదనుకుని పోలీసులకు కంప్లయింట్ చేశాడు నందలాల్‌. పోలీసులు హనుమాన్‌ను పిలిపించారు. స్టేషన్‌లో కూడా బర్రె తనదంటే తనదని ఇద్దరూ వాదులాడుకున్నారు. ఇద్దరిలో అసలు యజమాని ఎవరో పోలీసులకు అర్థం కాలేదు. పంచాయతీ పెద్దలకు కూడా ఏం పాలుపోలేదు. అంతలో స్టేషన్ ఆఫీసర్‌కు ఓ ఐడియా వచ్చింది. ఆ బర్రెను రెండు ఊళ్ల మధ్యన విడిచిపెడతామని, ఆ బర్రె ఏ యజమాని చెంతకు వెళితే వారే అసలైన యజమాని అని చెప్పాడా స్టేషన్‌ ఆఫీసర్‌. ఈ ఆలోచనలకు అందరూ ఓకే చెప్పారు. బర్రెను తెచ్చి రెండు ఊళ్ల మధ్యన విడిచిఎట్టారు. అది నేరుగా నందనాల్‌ ఇంటికి చేరుకుంది. అబద్ధాలు ఆడిన హనుమాన్‌ను పోలీసులు, గ్రామస్తులు గట్టిగా మందలించి వదిలేశారు.

Eha Tv

Eha Tv

Next Story