మన తలరాతలను మార్చే ఓటుపై(V0te) చాలా మంది పెద్దగా ఆసక్తి చూపించరు. ఓటు హక్కును వినియోగించుకోవాలన్న స్పృహ కూడా ఉండదు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే కర్ణాటక అసెంబ్లీ పోలింగ్(Karnataka Assembly polling) జరుగుతున్నది కదా!

A Bride in Karnataka Polling
మన తలరాతలను మార్చే ఓటుపై(V0te) చాలా మంది పెద్దగా ఆసక్తి చూపించరు. ఓటు హక్కును వినియోగించుకోవాలన్న స్పృహ కూడా ఉండదు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే కర్ణాటక అసెంబ్లీ పోలింగ్(Karnataka Assembly polling) జరుగుతున్నది కదా! పోలింగ్‌లో భాగంగా చిక్కమగళూరు(Chikkamagaluru) జిల్లాలో ఓ స్పూర్తిదాయకమైన దృశ్యం చోటు చేసుకుంది. మరి కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఓ నవ వధువు ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వచ్చింది.
మకొనహలి గ్రామానికి చెందిన ఆ యువతి పెళ్లి దుస్తుల్లోనే(Marriage outfit) ముదిగేరే అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటేసింది. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఓటు వేయడానికి వచ్చిన ఆ నవ వధువును ఎన్నికల అధికారులు అభినందించారు. ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాతంగా జరుగుతోంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 224 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ ఉంది.
ఇప్పటి వరకు ఓటు వేసిన ప్రముఖులలో ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి, ఆయన భార్య సుధా మూర్తి ఉన్నారు. ఈ దంపతులు బెంగళూరులోని జయనగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, కాంగ్రెస్ చీఫ్ డికే శివకుమార్, మాజీ సీఎం సిద్ధ రామయ్య, సినీనటులు ప్రకాష్‌రాజ్, కాంతారా ఫేం రిషభ్ షెట్టి, గణేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
